ఏపీలో వినూత్నమైన పథకాలు, కార్యక్రమాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్ మరో కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర భూ రీసర్వే ‘వైయస్‌ఆర్‌ జగనన్న భూహక్కు–భూరక్ష’ ప్రాజెక్టును జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించనున్నారు. శతాబ్ద కాలం తర్వాత తిరిగి ఏపీ ప్రభుత్వం సమగ్ర భూ రీసర్వే శ్రీకారం చుట్టింది. దీనికోసం సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.(చదవండి: పాత పద్దతిలోనే వ్యవయసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్)

3 దశల్లో సమగ్ర భూ రీసర్వే

సర్వే ఆఫ్‌ ఇండియా, సర్వే, పంచాయతీరాజ్,రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో భాగంగా రైతులపై భారం పడకుండా భూముల రిసర్వే కోసం ప్రభుత్వం రూ.967 కోట్ల రూపాయలను వేచిస్తుంది. రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4500 బృందాలు పనిచేయనున్నాయి. తొలి దశలో భాగంగా నేటి నుంచి 2021 జులై వరకు సర్వే చేపట్టనున్నారు. రెండవ దశ సర్వే 2021 అక్టోబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. చివరి దశ 2022 జులై నుండి 2023 జనవరి వరకు కొనసాగుతుంది.

సమగ్ర రీసర్వే ప్రాజెక్టును సీఎం ప్రారంభించిన అనంతరం.. రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని ఒక్కో గ్రామంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మరో వారంలో ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో ఒక్కో గ్రామం చొప్పున, మరో నాలుగైదు రోజుల తర్వాత ఒక్కో మండలంలో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 670 రెవెన్యూ గ్రామాల్లో ప్రారంభిస్తారు. మరో 20 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 5,122 గ్రామాల్లో భూముల సమగ్ర భూ రిసర్వే ప్రారంభించనున్నారు. మూడు విడతాల్లో భాగంగా రాష్ట్రంలోని 17 వేల గ్రామాల్లో ఉన్న 1.26 కోట్ల హెక్టార్ల భూమిలో సర్వే జరగనుంది. 13,371 గ్రామాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాలలోని 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో ఈ సర్వే నిర్వహిస్తారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here