భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ -01ను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి-సి 50) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 52వ సారి నింగీలోకి వెళ్లేందుకు సిద్దమైంది. నేడు (డిసెంబర్ 17) మధ్యాహ్నం 3.41 గంటలకు శ్రీహరికోట స్పేస్పోర్ట్ వద్ద రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ‘వాతావరణ పరిస్థితులకు లోబడి’ లిఫ్ట్-ఆఫ్ కానుంది. బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.

ఇంకా చదవండి: రైతులకు గుడ్ న్యూస్.. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపు

“పిఎస్ఎల్వి-సీ50 లాంచ్ వెహికల్ ద్వారా సిఎమ్ఎస్01 శాటిలైట్ ని ప్రయోగించడానికి బుధవారం 14: 41 కౌంట్ డౌన్ ప్రారంభమమైంది. నేడు 15:41 గంటలకు శాటిలైట్ ని కక్ష్యలో ప్రవేశ పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు” ఇస్రో తెలిపింది. సీఎంఎస్-01 అనేది అంతరిక్ష సంస్థ యొక్క 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది భారతదేశం, అండమాన్ మరియు నికోబార్ మరియు లక్షద్వీప్ ద్వీపాలకు కూడా మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిచాటానికి దోహదపడుతుందని తెలిపారు. మొత్తం ఏడేళ్లపాటు సేవలు అందించనుంది. దీని బరువు మొత్తం 1410 కిలోలు. శ్రీహరికోట నుండి ప్రయోగించే 77వ మిషన్ ఇది. గత నెల నవంబర్ 7న పిఎస్‌ఎల్‌వి-సి49 (ఇఒఎస్ -01) ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం మరియు తొమ్మిది కస్టమర్ వ్యోమనౌకలను విజయవంతంగా ప్రయోగించింది. ఇది కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇస్రో ప్రయోగించిన మొదటి మిషన్. సిఎమ్ఎస్01 శాటిలైట్ ద్వారా మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here