గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ యొక్క మూడవ త్రైమాసిక ఆదాయం అంతకుముందు సంవత్సరం కంటే 14 శాతం పెరిగింది. గూగుల్ మరియు యూట్యూబ్ రెండింటి యొక్క ప్రకటనల ఆదాయం రోజు రోజుకి పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది(2020) మూడవ త్రైమాసికంలో యూట్యూబ్ ప్రకటనల ద్వారా 5 బిలియన్(సుమారు 35,000 రూ.) డాలర్లు ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనా వైరస్ కారణంగా ప్రకటన దారులు ఖర్చుల తగ్గింపు వల్ల కొంచెం ఆదాయం తగ్గిన మళ్ళీ సాదరణంగానే తిరిగి వస్తారని యూట్యూబ్ ఆశిస్తుంది.
యూట్యూబ్‌లో ఇప్పుడు సుమారు 30 మిలియన్లకు పైగా మ్యూజిక్ మరియు ప్రీమియం పేమెంట్ చందాదారులు ఉన్నారు. యూట్యూబ్ టివిలో 3 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు.2020 సంవత్సరం మార్చి మధ్య నుండి యూట్యూబ్‌లో గైడెడ్ ధ్యాన వీడియోల వీక్షణలు దాదాపుగా 40 శాతం వరకు పెరిగాయి. అయితే DIY ఫేస్ మాస్క్ ట్యుటోరియల్స్ వీక్షణలు ఈ మధ్య కాలంలో 1 బిలియన్ వరకు దాటాయి అని ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ సమాచారం ఇచ్చారు. “మూడవ త్రైమాసికంలో ప్రకటనదారులు ప్రకటన దారులు తిరిగి యాడ్స్ ని మళ్ళీ తీసుకొచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము” అని ఆల్ఫాబెట్ మరియు గూగుల్ యొక్క CFO రూత్ పోరాట్ పెట్టుబడిదారులకు తెలిపారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.