టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మారిపోయారు. టెస్లా ఇంక్ షేర్లు 5 శాతం పెరగడంతో టెస్లా సీఈఓ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఎలాన్ యొక్క టెస్లా షేర్ లు 21% వాటా పెరగడంతో అతని నికర ఆస్తి విలువ 195 బిలియన్ డాలర్లకుపైగా పెరగింది. ఇప్పుడు 185 బిలియన్ డాలర్ల సంపాదనతో జెఫ్ బెజోస్ రెండవ స్థానంలో నిలిచాడు. ప్రస్తుత టెస్లా యొక్క మార్కెట్ విలువ 774 బిలియన్ల డాలర్లను దాటింది, దీంతో ఇప్పుడు టెస్లా వాల్-స్ట్రీట్ యొక్క ఐదవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.
ఇంకా చదవండి: టెలిగ్రామ్, సిగ్నల్ వైపు వాట్సాప్ యూజర్ల చూపు.. ?
ఎలాన్ మస్క్ కేవలం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారీ సీఈఓగా మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో రాకెట్ల తయారీ సంస్థతో పాటు, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలాన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కేవలం అన్నీ కంపెనీలాగానే కార్లను తయారు చేయకుండా కొత్త పర్యావరణహిత కార్లను రూపొందించాడు. టెస్లా కంపెనీ యొక్క మోడల్ ఎస్ కారు ప్రపంచవ్యాప్త అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. దీంతో కంపెనీ షేర్ లు క్రమంగా పెరిగాయి. గత ఏడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న మస్క్ తక్కువ కాలంలోనే ప్రపంచ కుబేరుడిగా నిలిచాడు. టెస్లా షేర్ ధర గతేడాది నుండి ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. 2020 నవంబర్ లో బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండవ స్థానంలో నిలిచిన మస్క్ కేవలం రెండు నెలల్లోనే మొదటిస్థానానికి చేరుకున్నాడు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.