ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు, మత సంఘర్షణల తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పాక్ కీ షాక్ ఇస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కీ చెందిన మిరాజ్ ఫైటర్ జెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అగోస్టా 90బి క్లాస్ జలాంతర్గాములను అప్‌గ్రేడ్ చేసే విషయం తమ సహకారం అందించబోమని ఫ్రాన్స్ నిర్ణయించింది. అంతే కాకుండా భారత్‌కు ప్రయోజనం కలిగించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.(చదవండి: ఫేస్ స్కాన్ తో ఆధార్ డౌన్లోడ్)

రఫేల్‌ యుద్ధ విమానాలను మరమ్మతు చేయించేటప్పుడు పాక్‌ మూలాలున్న సాంకేతిక నిపుణులను దగ్గరకు రానివ్వొద్దని ఖతార్‌కు సూచించింది. ఖతార్ ప్రభుత్వం కూడా ఫ్రాన్స్ నుండి రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఖతార్ నుంచి రఫేల్ ఫైటర్ జెట్లకు సంబంధించిన వివరాలను సేకరించిన పాక్.. ఇప్పటికే ఆ సమాచారాన్ని చైనాకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రధాని నిర్ణయం భారత్‌కు లబ్ధి చేకూర్చనుంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు ఇది మరింత ప్రయోజనం కలిగించనుంది.

మిరాజ్ III మరియు మిరాజ్ 5 ఫైటర్ జెట్లను అప్‌గ్రేడ్ చేయకూడదని ఫ్రెంచ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ వైమానిక దళాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఇందులో ఫ్రెంచ్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన 150 మిరాజ్ ఫైటర్ జెట్‌లు ఉన్నాయి. అయితే, వాటిలో సగం మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

2 COMMENTS

Comments are closed.