Friday, April 26, 2024
HomeHow ToPAN-Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకు గడువు పొడగించిన కేంద్రం

PAN-Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకు గడువు పొడగించిన కేంద్రం

PAN-Aadhaar Link: పాన్ కార్డు యూజర్లకు కేంద్రం తీపికబురు అందించింది. పాన్‌-ఆధార్‌(PAN-Aadhaar Link) లింకు గడువును పొడగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31తో ఈ గడువు ముగియాల్సి ఉండగా.. మరో 3 నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు లింకు చేసేందుకు అవకాశం ఇచ్చింది.

(ఇది కూడా చదవండి: Pan card: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)

పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) తెలిపింది. నిర్దేశిత గడువులోగా పాన్‌-ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్‌ నిరుపయోగంగా మారనుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.

పాన్‌ కార్డు(Pan Card) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో (Aadhaar) అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు పొడగింపుకు సంబంధించి గతంలోనే పాన్ కార్డుదారులకు అవకాశం ఇచ్చింది. రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది.

పెనాల్టీతో పాన్-ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి..?

  • ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
  • మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
  • ఆ తర్వాత ఈపే ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ పాన్, మొబైల్ నంబర్ కన్ఫామ్ చేయాలి. అప్పుడు ఓటీపి వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత తిరిగి ఈ-పే ట్యాక్స్ పేజీకి వస్తుంది.
  • ఇప్పుడు ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి.
  • ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఎంచుకుని పేమెంట్ టైప్ ఎంచుకుని కంటిన్యూపై క్లిక్ చేయాలి.
  • ఒక వేళ మీ బ్యాంక్ అకౌంట్ ఈ-పే ట్యాక్స్‌కు లింక్ కానట్లయితే మరో ఆప్షన్ ఎంచుకోవాలి.

పాన్-ఆధార్ లింకు చేసుకోకపోతే కలిగే నష్టాలు..?

  • చెల్లుబాటులో లేని పాన్‌ వల్ల బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతాల్లాంటివి తెరవలేరు.
  • మ్యూచువల్‌ ఫండ్లలో డబ్బులు మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles