ఐపీఎల్ ప్రియులకు ఎయిర్‌టెల్, జియో టెలికామ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. బీసీసీఐ ఇటీవలే ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి)తో తలపడనుంది. ప్రస్తుతం అయితే ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచే ఐపిఎల్ 2021ను వీక్షించాల్సి ఉంటుంది.

అలాగే, ఈ టోర్నమెంట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా చూడటానికి అవకాశం ఉంది. మీరు కనుక ఎయిర్‌టెల్, జియో కస్టమర్ అయితే ఐపీఎల్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడవచ్చు. సాధారణంగా ఇందులో మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలంటే ప్రతీ నెలా రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఎయిర్‌టెల్, జియో కంపెనీలు తమ వినియోగదారుల కోసం డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత చందాతో కూడిన ప్రత్యేక రీఛార్జి ప్లాన్ లను అందిస్తున్నాయి. దీనివల్ల మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడటంతో పాటు ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మరి ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..

జియో రీచార్జ్ ప్లాన్స్:

రూ.401 రీచార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
28 రోజుల వ్యాలిడిటీ
ప్రతి రోజు 3జీబీ డేటా + 6జీబీ అదనపు డేటా
ఉచిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు
రూ.499 క్రికెట్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
56 రోజుల వ్యాలిడిటీ
84జీబీ డేటా (రోజుకు 1.5జీబీ)
రూ.777 రీచార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
84 రోజుల వ్యాలిడిటీ
ప్రతి రోజు 1.5జీబీ డేటా + 5జీబీ డేటా ఆధానం
ఉచిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు
రూ.2,599 రీఛార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
365 రోజుల వ్యాలిడిటీ
ప్రతి రోజు 2జీబీ డేటా + 10జీబీ అదనపు డేటా
ఉచిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు

ఎయిర్ టెల్ రీచార్జ్ ప్లాన్స్:

రూ.401 రీఛార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
28 రోజుల వ్యాలిడిటీ
30జీబీ డేటా
రూ.448 రీఛార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
28 రోజుల వ్యాలిడిటీ
రోజుకు 3జీబీ డేటా
అపరిమిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు
రూ.599 రీఛార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
56 రోజుల వ్యాలిడిటీ
రోజుకు 2జీబీ డేటా
అపరిమిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు
రూ.2,698 రీచార్జ్ ప్లాన్డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపీ ఉచిత సబ్ స్క్రిప్షన్
365 రోజుల వ్యాలిడిటీ
రోజుకు 2జీబీ డేటా
అపరిమిత వాయిస్ కాలింగ్
రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.