ఒక సంవత్సరం తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది. పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతంపై ఇస్రో ఛైర్మన్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం సఫలీకృతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అంతకుముందు పీఎస్ఎల్‌వీ సి-49 ప్రయోగం 15 నిమిషాలు వాయిదా పడింది. భారీ వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం అయింది. మొదటగా 3:02 నిమిషాలకు ప్రయోగించాలని భావించిన శాస్త్రవేత్తలు పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు రాకెట్ ప్రయోగించారు.
మిషన్ విజయవంతం అయిన తరువాత, ఇస్రో చైర్మన్ కె శివన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ఇస్రో అంతరిక్ష సంస్థకు చాలా “ప్రత్యేకమైన మరియు అసాధారణమైన మిషన్” అని అన్నారు. “మనం అనుకున్నట్లు అంతరిక్ష కార్యకలాపాలు ఇంటి నుండి చేయలేము. ముఖ్యంగా ప్రయోగ సమయంలో, ప్రతి ఇంజనీర్, టెక్నీషియన్ మరియు ఇతర ఉద్యోగులందరూ వేర్వేరు కేంద్రాల నుండి ప్రయాణించి, ఇక్కడ షార్ వద్ద కలిసి పనిచేయాలి. అలాగే, వివిధ కేంద్రాల నుండి వివిధ హార్డ్‌వేర్ పరికారలను జాగ్రత్తగా రవాణా చేయాల్సి వచ్చింది” అని తెలిపారు. మా ఇస్రో బృందం పరిమిత సిబ్బందితో పనిచేసింది, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా అన్ని ప్రభుత్వ ప్రోటోకాల్‌లను అనుసరించి ఈ ప్రయోగాన్ని పూర్తి చేశామని చెప్పారు. తర్వాత దశలో మరో మూడు లాంచ్‌లు పిఎస్‌ఎల్‌వి-సి 50 వాహనం ద్వారా సిఎంఎస్ 01, కొత్త వాహన ఎస్‌ఎస్‌ఎల్‌వి తీసుకెళ్లనున్న ఇఒఎస్ -02, జిఎస్‌ఎల్‌వి ఎఫ్ -10 మోయనున్నా ఇఒఎస్ -03 వరుసలో ఉన్నాయని శివన్ తెలిపారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.