4జీ సర్వీసులకు సంబంధించి డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్‌ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. గత నెల మే గణాంకాల ప్రకారం సెకనుకు సగటున 20.7 మెగాబిట్‌(ఎంబీపీఎస్‌) డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక అప్‌లోడ్‌ స్పీడ్‌ పరంగా వొడాఫోన్‌ ఐడియా 6.7 ఎంబీపీఎస్‌ వేగంతో నంబర్‌ వన్‌గా ఉంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జియో 4జీ నెట్‌వర్క్‌ వేగం స్వల్పంగానే పెరిగినప్పటికీ… సమీప ప్రత్యర్థి సంస్థ వొడొఫోన్‌ ఐడియాతో పోలిస్తే ఇంకా మూడు రెట్లు అధికంగానే ఉంది.

వొడాఫోన్‌ ఐడియా సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 6.8 ఎంబీపీఎస్‌ మాత్రమే. 2018 ఆగస్టులో వొడాఫోన్‌, ఐడియా విలీనం తర్వాత రెండు సంస్థల గణాంకాలను కలిపి ట్రాయ్‌ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక 4జీ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్‌ సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అత్యంత తక్కువగా 4.7 ఎంబీపీఎస్‌గాను. అప్‌లోడ్‌ స్పీడ్‌ 3.6 ఎంబీపీఎస్‌గాను ఉంది. అప్‌లోడ్‌ స్పీడ్‌ విషయంలో వొడాఫోన్‌ ఐడియా అగ్రస్థానంలో ఉండగా జియో రెండో స్థానంలో (4.2 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఏస్‌ఎన్‌ఎల్‌ కూడా కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందిస్తున్నప్పటికీ ఆ గణాంకాలు ట్రాయ్‌ తన డేటాలో వెల్లడించలేదు.

Support TechPatashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.