ఓ కారు.. రన్‌వేపై రెక్కలు విచ్చుకొని విహంగంలోకి రివ్వున ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు. ఇటీవల స్లొవేకియాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన కారు కొద్దిసేపు గాల్లో ప్రయాణించింది. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. స్లొవేకియాకు చెందిన క్లెయిన్విజన్ అనే కంపెనీ తన ఫ్లయింగ్ కారును కొద్దిసేపు గాల్లోకి ఎగిరించి పరీక్షించింది. దీనిని వారు ముద్దుగా ‘ఎయిర్‌కార్’ అని పిలుస్తున్నారు. ఈ పరీక్షలో భాగంగా ‘ఎయిర్‌కార్’ మూడు నిమిషాల్లో తనను తాను విచ్చుకుంటూ విమానం కారు 1,500 అడుగుల గాలిలో ఎగిరింది.
నిపుణులు తెలిపిన ప్రకారం, ఈ కారు సొంత ప్రయాణాలకు లేదా వాణిజ్య టాక్సీ సేవలకు అనుకూలంగా ఉంటుంది. “ప్రొఫెసర్ స్టీఫన్ క్లీన్ రూపొందించిన కారు ఐదవ తరానికి చెందింది. ఈ వారం స్లోవేకియాలోని పియస్టనీ విమానాశ్రయంలో రెండు 1500 ′ AGL విమానాలను తయారు చేసింది. ఈ మోడల్ రెండు టేకాఫ్‌లు మరియు ల్యాండింగ్‌తో సురక్షితంగా పరీక్షించం” అని తెలిపారు.
1,100 కిలోల బరువు ఉన్న రెండు సీట్ల మోడల్ కారు ఒక్కో విమానం 200 కిలోల అదనపు లోడ్ మోయగలదని ఒక ప్రకటనలో తెలిపారు. “బిఎమ్‌డబ్ల్యూ 1.6 ఎల్ ఇంజిన్‌తో నడిచే ఈ కార్-ప్లేన్ 140 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 1,000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అంచనావేస్తున్నారు. గాలిలో నడిచేటప్పుడు విమానం 18 లీటర్లు/గం ఇందనాన్ని వినియోగస్తుందని తెలిపారు. క్లీన్విజన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ తెలిపిన ప్రకారం, ఎయిర్ కార్ యొక్క ఫ్లయింగ్ ప్రోటోటైప్‌ను 2019 నవంబర్‌లో షాంఘైలోని చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.