ఎల్‌ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తి ధరలు జనవరి నుంచి 10 శాతం మేర పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి కీలకమైన ముడి పదార్థాల ఖర్చులు పెరగడంతో పాటు సముద్ర, వాయు రవాణా ఛార్జీల పెరుగుదల కారణంగా గృహ సంబందిత ఉపకరణాల ధరలు పెరగనున్నాయి. అంతేకాకుండా, గ్లోబల్ విక్రేతల సరఫరా కొరత కారణంగా టీవీ ప్యానెల్స్ (ఒపెన్సెల్) ధరలు కూడా రెండు రెట్లు పెరగనున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ప్లాస్టిక్ ధర కూడా పెరిగింది. ఎల్‌జీ, పానాసోనిక్, థామ్సన్ వంటి తయారీదారులు జనవరి నుంచి ధరలను పెంచబోతునట్లు పేర్కొన్నారు. అయితే సోనీ మాత్రం ధరలపై తన తుది నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.
10 నుంచి 11 శాతం ధరలు పెంపు?
పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సీఈఓ మనీష్ శర్మ మాట్లాడుతూ.. వస్తువుల ధరల పెరుగుదల సమీప భవిష్యత్తులో ఉత్పత్తి ధరలపై ప్రభావం చూపనుంది. “జనవరిలోనే ధరలు 6-7 శాతం పెరుగుతాయని నేను ఊహించాను మరియు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో చివరికీ 10-11 శాతం వరకు పెరగవచ్చు” అని పీటీఐ నివేదికలో పేర్కొన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా తన పరికరాలలో ధరను 7-8 శాతం పెంచబోతోంది. “జనవరి నుండి టీవీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ వంటి అన్ని ఉత్పత్తులపై 7 నుండి 8 శాతం” ధరలను పెంచబోతునట్లు పేర్కొన్నారు.
20 శాతం పెరగనున్న స్మార్ట్ టీవి ధరలు
సోనీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ మాట్లాడుతూ.. ఇంటి నుండి పని చేయడం వల్ల అధిక డిమాండ్ ఉందని, ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం వల్ల సరఫరా పరిమితంగా ఉందని చెప్పారు. చిన్న స్క్రీన్ పరిమాణాల ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. భారతదేశంలో ఇప్పటికీ 32 అంగుళాల స్క్రీన్ సైజు టీవీలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది అని నాయర్ అన్నారు. మార్కెట్లో టీవీ ఒపెన్సెల్ కొరత ఉందని వీటి ధరలు 200 శాతం పెరిగాయని ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్& కోడాక్ తెలిపింది. “ప్రపంచంలో ప్యానెల్ తయారీకి ప్రత్యామ్నాయం లేనందున మేము చైనాపై ఆధారపడుతున్నాము. కాబట్టి థామ్సన్ & కోడాక్ జనవరి నుండి ఆండ్రాయిడ్ టీవి ధరలు 20 శాతం పెరగనున్నట్లు” అని ఎస్పీపిఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] […]