రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ పిచ్చి పెరిగిపోతుంది. ఎంతలా అంటే స్మార్ట్ ఫోన్ కొనిస్తేనే పెళ్లి చేసుకునే అంతలా. ఈ మధ్య ఒక యువకుడు ఎంఐ 10టీ ప్రో ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ట్విటర్ లో ఒక పోస్ట్ చేసాడు. కమాల్ అహ్మద్ అనే యువకుడు.. “ఎంఐ 10టీ ప్రో నా చేతికి వచ్చేవరకు నేను పెళ్లి చేసుకోను” అను ట్విటర్ లో డిసెంబర్ 11న పోస్ట్ చేసాడు. అంతేకాకుండా చివర్లో #ఎంఐఫ్యాన్ కమాల్ అహ్మద్ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ట్విట్ చేసిన పది రోజుల తర్వాత కమాల్ తాను కోరిన ఎంఐ 10టీ ప్రో పార్సిల్ ఇంటికి వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ లో “ఫైనల్లీ రిసీవ్డ్ దిస్ మాన్స్టర్” అనే ట్యాగ్ తో పోస్ట్ చేయడంతో పాటు ఆ ఫోన్ కొన్ని ఫీచర్స్ ని వివరించాడు. చివరికి తనకు ఇష్టమైన మొబైల్ ని కమాల్ ఉచితంగా పొందాడు. ఎంఐ కంపెనీ కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించింది. ఎంఐ కంపెనీ యొక్క ప్రోగ్రాముల్లో భాగంగా పలు బిల్డింగ్ యాక్టివిటీస్ లో పాల్గొని ఈ స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నట్టు పేర్కొంది. ఈ మొబైల్ కోసం దాచుకున్న డబ్బులను పెళ్లి ఖర్చు కోసం ఉపయోగించుకోవచ్చు. దీనికి ప్రతిస్పందనగా షియోమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ కూడా ట్విటర్ లో కంగ్రాట్స్ చెప్పడంతో పాటు “ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అనుకుంటా.. హ్హహ్హ” అంటూ ట్విట్ చేసాడు. దింతో అన్ని ట్విట్స్ వైరల్ అయ్యాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.