రెండు రోజుల ఫేస్‌బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 కార్యక్రమంలో భాగంగా రీలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో కలిసి వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. “భారతదేశంలో మీ ప్రమేయం కోసం మేము ఎదురుచూస్తున్నాము… మిగతా ప్రపంచం భారత విధానాల నుండి నేర్చుకుంటుందని నేను ఆశిస్తున్నాను” అని ఆసియా యొక్క అత్యంత ధనవంతుడైన అంబానీ జుకర్‌బర్గ్‌తో వర్చువల్ ఇంటరాక్షన్‌లో చెప్పారు. “మీతో కలిసి భాగస్వామ్యాన్ని పంచుకున్నందుకు నేను ఎంత కృతజ్ఞుడను, ధన్యవాదాలు” అంటూ జుకర్‌బర్గ్ స్పందించారు.

ఇంకా చదవండి: గూగుల్ సేవల్లో అంతరాయానికి కారణం ఇదే!

ప్రపంచంలోని డిజిటల్ కనెక్టివిటీకి నిజమైన ఆర్కిటెక్ట్‌గా మీరు నిలిచారు అని ముఖేష్ అంబానీ జుకర్‌బర్గ్‌ను కొనియాడారు. మా సంస్థ భారతదేశంలో కొంత కనెక్టివిటీని నిర్మించిందని, అయితే ఫేస్‌బుక్ ప్రపంచానికి ఆ పని చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఫేస్‌బుక్, వాట్సాప్ కి భారతదేశం అతిపెద్ద కమ్యూనిటీలకు నిలయంగా మారిందని, ఇన్‌స్టాగ్రామ్‌ విషయంలో కూడా అక్కడకు చేరుకుంటుందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థ గత నెలలో భారతదేశంలో వాట్సాప్ చెల్లింపులను ప్రారంభించింది. ఇప్పుడు యూజర్లు తమ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సందేశం పంపినంత సులభంగా డబ్బు పంపవచ్చు. భారతదేశంలో నిర్మించిన యుపిఐ వ్యవస్థ కారణంగా అది సాధ్యమైంది. కంపెనీ 140 బ్యాంకులతో కలిసి పనిచేస్తోందని, దీనికి 140 బ్యాంకులు మద్దతు ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఈ రకమైన ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చినందుకు, డిజిటల్ ఇండియాను సాధించడంలో సహాయపడిన వారందరికీ కంపెనీ కృతజ్ఞతలు తెలుపుతుంది అని జుకర్‌బర్గ్ అన్నారు.

ఇంకా చదవండి: ఏపీలో ఇంటి స్థలాల పంపిణీకి ముమ్మరంగా ఏర్పాట్లు

“జియో ద్వారా డిజిటల్ కనెక్టివిటీని సృష్టించాం, అలాగే జియో మార్ట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ అవకాశాన్ని కల్పించింది. అలాగే వాట్సప్ ఇప్పుడు వాట్సాప్ పేతో డిజిటల్ ఇంటరాక్టివిటీని లావాదేవీలను పెంచింది. భారతదేశంలోని గ్రామాలలో, పట్టణాలలో ఉన్న దుకాణాలను డిజిటలైజ్ చేయడానికి అవకాశం ఉంది” అని అన్నారు.భారతదేశంలో ఇప్పటివరకు సాధించిన డిజిటల్ విజయాల ఘనత మోడీకే చెందుతుందని తెలిపారు. త్వరలో ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో అంబానీ నరేంద్ర మోడీ డిజిటల్ విజన్ ను కొనియాడారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.