బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్ జూన్ 2022 నాటికి భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడానికి భారతి గ్లోబల్ ఇంగ్లండ్ కంపెనీమెథెరా వన్‌వెబ్ కంపెనీతో కలిసి దీనిని అభివృద్ది చేస్తుంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదే)

“ఆఫ్రికా, భారతదేశం మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో గ్రామీణ ప్రజలకు ఎటువంటి ఆటంకం లేని బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్ నెట్ అందించడం కోసం వన్‌వెబ్ యొక్క ఉపగ్రహ నెట్‌వర్క్ సహాయం తీసుకొనున్నాం. దీని ద్వారా ప్రజలతో పాటు ప్రభుత్వాలకు అతిపెద్ద ప్రయోజనం ఉంటుంది. క్లిష్టమైన సమయాలలో రక్షణ శాఖ యాప్ లకు సహాయం అందుతుంది. ఇప్పటికే బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ మాతో కలిసి పనిచేయడానికి సంసిద్దంగా ఉంది. వారికి చాలా మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ అందించడం అవసరం” అని భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు.

ఈ వన్‌వెబ్ ఎయిర్‌టెల్ సేవలను ప్రభావితం చేయదని సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎడారి మరియు పర్వత ప్రాంతాలలో సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వన్‌వెబ్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం వన్‌వెబ్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సునీల్ మిట్టల్, వన్‌వెబ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నీల్ మాస్టర్‌సన్‌ను నియమించారు.

వన్‌వెబ్ 2022 మే-జూన్ నాటికి దేశంలో తన సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. వన్‌వెబ్ వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తన సేవలను పరీక్షించనుంది. ఏదేమైనా, పరీక్షను ప్రారంభించడానికి సంస్థకు అన్నీ అనుమతులతో పాటు గ్రౌండ్ స్టేషన్లు కూడా అవసరం. ఇంకా, వన్‌వెబ్ తన సేవలను అడవులు, ఎడారులు, హిమాలయాలు, ధ్రువ మరియు దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించబడని మరిన్ని ప్రాంతాలలో అందించాలని చూస్తుంది. అంటే ఆ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను పొందటానికి మీరు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. వన్‌వెబ్ తన మొత్తం 36 ఉపగ్రహ పేలోడ్‌ను 2020 డిసెంబర్‌లో ప్రయోగించాలని యోచిస్తోంది. “ఈ ఉపగ్రహాలను ఇప్పటికే ఫ్లోరిడా నుండి వోస్టోచ్నీకి రవాణా చేశారు. వీటిని అంతరిక్షంలోకి పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి” అని భారతి గ్లోబల్ తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here