చైనా మొబైల్ సంస్థ పోకో భారత దేశంలో వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎమ్ 2 ను నేడు విడుదల చేసింది. జులైలో విడుదలైన పోకో ఎమ్ 2 ప్రొ ను మార్పులు చేసి దేశంలో పోకో 2 ప్రొ పేరుతో విడుదల చేసింది. పోకో ఎమ్ 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరాలు మరియు పెద్ద బ్యాటరీ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్, మూడు కలర్ లలో లభిస్తుంది.

పోకో ఎమ్ 2 ధర(POCO M2 PRICE):

పోకో ఎమ్2 6GB + 64GB మరియు 6GB + 128GB రెండు స్టోరేజ్ లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 10,999 కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 12,499గా పేర్కొంది. పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ మరియు బ్రిక్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 15 నుండి మధ్యాహ్నం 12 గంటలకు నుండి ఫ్లిప్‌కార్ట్ లో లభించనుంది.

పోకో ఎమ్ 2 స్పెసిఫికేషన్స్(POCO M2 Specifications):

ఆండ్రాయిడ్ 10 ఎంఐ యుఐ ఆధారంగా డ్యూయల్ సిమ్(నానో)తో పోకో ఎమ్2 పనిచేస్తుంది, ఎంఐ యుఐ 12 త్వరలో రానుంది. ఇది 6.53 అంగుళాల HD + (1,080×2,340 పిక్సెల్స్) డిస్ప్లే ని కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3చేత రక్షించబడుతుంది. పోకో M2 మీడియాటెక్ హెలియో G80 SoC ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మాలి G52 GPU మరియు 6GB LPDDR4x RAMతో కలిసి పని చేయనుంది.

ఇకా కెమెరా విషయానికొస్తే, పోకో M2లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కెమెరా ఉంది.

పోకో ఎమ్2 128GB స్టోరేజ్ ని కలిగి ఉంది. ఇంకా స్టోరేజ్ పెంచుకోవడం కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరిచుకునే అవకాశం ఉంది. ఫోన్‌లోని కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ వోల్టిఇ సపోర్ట్, 4జి, బ్లూటూత్ వి 5.0, ఐఆర్ బ్లాస్టర్, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. పోకో M2లో ఉన్న సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటి సెన్సార్ ఉన్నాయి. 18W ఫాస్ట్ చార్జర్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఫోన్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం P2i పూతతో వస్తుంది.