సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. చైనా దేశానికి చెందిన 118 యాప్ లపై నిషేదం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిషేదం విధించిన యాప్ లలో ప్రపంచ వ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన పబ్జీ గేమ్ కూడా ఉంది. గతంలో గాల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న నేపథ్యంలో అప్పుడు టిక్ టాక్ సహ 59 మొబైలు యాప్ లపై నిషేదం విధించింది. గత కొంత కాలంగా జమ్ము కాశ్మీరీ లోని సరిహద్దులలో చైనా భారీగా సైన్యాన్ని మేహరించింది. అయితే, చైనా చర్యలను ధీటుగా తిప్పి కొడుతున్న ప్రభుత్వం.. తాజాగా దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తునాయనే కారణంతో చైనాకు సంబందించిన 118 యాప్ ల పై నిషేదం విధించింది. ఈ యాప్ ల ద్వారా దేశ అంతర్గత సమాచారాన్ని అనధికారికంగా సేకరించి విదేశాలలో ఉన్న సర్వర్లకు చెర వేస్తున్నాయని అందిన పిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించిన యాప్ లలో ముఖ్యంగా పబ్జీని నిషేధం విధించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పబ్జీని నిషేధించడం సరైన చర్యగా తల్లి, తండ్రులు భావిస్తున్నారు. కానీ, యువత మాత్రం దీనిని నిషేధించడం వల్ల చాలా భాదపడుతున్నారు. పబ్జీకి భారత్ లో విశేష ఆదరణ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ పైగా డౌన్లోడ్ చేసుకోగా.. ఒక్క భారత్ నుండే 50 మిలియన్ పైగా డౌన్లోడ్ చేసుకున్నారంటే మనం అర్దం చేసుకోవచ్చు మన దేశంలో దీనికి ఎంత ఆదరణ ఉందో అని. పబ్జీ గేమ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా బ్రెండన్‌ గ్రీన్‌, జాంగ్‌ టె-సియాక్‌ ఉన్నారు. 2000 సంవత్సరంలో జపనీస్‌ చిత్రం బ్యాటిల్‌ రాయల్‌ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here