ఈ నెల ప్రారంభంలో జరిగిన IFA 2020 కార్యక్రమంలో చైనాకు చెందిన రియల్ మీ సంస్థ రియల్ మీ నార్జో 20 పేరిట కొత్త సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా రియల్ మీ నార్జో 20, రియల్ మీ నార్జో 20A, రియల్ మీ నార్జో pro మూడు మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ మూడు మోడళ్లను వచ్చే వారం సెప్టెంబర్ 21వ తేదీన భారత దేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతలోనే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబందించిన స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టిప్‌స్టర్ రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ ట్విట్టర్‌లో లీక్ చేయడంతో ఆ స్పెక్స్ వైరల్‌గా మారాయి. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ మాత్రమే కాదు, రియల్‌మీ నార్జో 20ఏ, రియల్‌మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. లీకైన స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్)
రియల్ మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్(expected):
డిస్‌ప్లే | 6.5 అంగుళాల హెచ్ డీ+ |
ర్యామ్ | 4 జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 64 జీబీ, 128 జీబీ |
ప్రాసెసర్ | మీడియాటెక్ హీలియో జీ85 |
ప్రధాన కెమెరా | 48+8+2 మెగాపిక్సెల్ |
ముందు కెమెరా | 8 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 6,000 ఎంఏహెచ్(18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 10 + రియల్ మీ యూఐ |
సిమ్ సపోర్ట్ | డ్యూయెల్ సిమ్ సపోర్ట్ |
కలర్స్ | గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ |
రియల్ మీ నార్జో 20A స్పెసిఫికేషన్స్(expected):
డిస్‌ప్లే | 6.5 అంగుళాల హెచ్‌డీ+ |
ర్యామ్ | 3జీబీ, 4జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 32జీబీ, 64జీబీ |
ప్రాసెసర్ | క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 |
ప్రధాన కెమెరా | 12+2+2 మెగాపిక్సెల్ |
ముందు కెమెరా | 8 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ |
సిమ్ సపోర్ట్ | డ్యూయెల్ సిమ్ |
కలర్స్ | గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ |
రియల్ మీ నార్జో 20 ప్రొ స్పెసిఫికేషన్స్(expected):
డిస్‌ప్లే | 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ |
ర్యామ్ | 6జీబీ, 8జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 64జీబీ, 128జీబీ |
ప్రాసెసర్ | మీడియాటెక్ హీలియో జీ95 |
ప్రధాన కెమెరా | 48+8+2+2 మెగాపిక్సెల్ |
ముందు కెమెరా | 16 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 4500ఎంఏహెచ్ బ్యాటరీ (65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ |
సిమ్ సపోర్ట్ | డ్యూయెల్ సిమ్ |
కలర్స్ | వైట్ నైట్, బ్లాక్ నిన్జా |
అయితే ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్టేనా అంటే చెప్పలేం. సెప్టెంబర్ 21న ఈ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యే వరకు పూర్తి స్పెసిఫికేషన్స్ అంచనా వేయడం కష్టం.(చదవండి: టిక్ టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్)