ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వినోయోగదారులు ఉపయోగించే గూగుల్ సేవలు నిన్న సాయంత్రం ఒక గంటపాటు నిలిచిపోయాయి. దీనివల్ల జీ-మెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ వంటి సేవలను వినియోగదారులు ఉపయోగించలేకపోయారు. అంతరాయం ఏర్పడిన కొద్దిసేపటికే ప్రతి ఒక్కరి బ్రౌజర్ లో ఎరుపు రంగు సూచిక కన్పించింది. ఆకస్మికంగా ఏర్పడిన అంతరాయం వల్ల గూగుల్‌తో సహా చాలా మందికి ఇబ్బంది కలిగింది. ఈ సమస్య వల్ల ఏర్పడిన అంతరాయనికి చింతిస్తున్నాం, దీనికి క్షమాపణలు కోరుతున్నాము అని ఒక గూగుల్ ప్రతినిధి తెలిపారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది అని అన్నారు. గూగుల్ సర్వర్ లో ఉన్న “ఇంటర్నల్ స్టోరేజ్ కోటా ఇష్యూ” వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని గూగుల్ చెబుతోంది.
గూగుల్ సర్వర్ లో ఉన్న “ఇంటర్నల్ స్టోరేజ్ కోటా” సమస్య కారణంగా 45 నిమిషాల పాటు గూగుల్ సేవలలో అంతరాయం ఏర్పడిందని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ప్రతి సేవకు తగినంత ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని కేటాయిస్తుందని, సరైన కాలంలో ఆ సేవలు ఊహించిన విదంగా పనిచేయలేదని గూగుల్ ప్రతినిధి వివరించారు. ఇంటర్నల్ స్టోరేజ్ పూర్తీ అయినా తర్వాత సిస్టమ్ స్వయంచాలకంగా ఎక్కువ నిల్వను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది, దానివల్ల సిస్టమ్ క్రాష్ అయిందని తెలిపారు. సాదారణంగా మనం ఉపయోగించే కంప్యూటర్స్ లో హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్ లేనప్పుడు/ పూర్తీ అయినప్పుడు. మన కంప్యూటర్ పని చేయకపోవడం ఎలా జరుగుతుందో. అదే విదంగా నిన్న గూగుల్ సర్వర్ లో ఏర్పడిన “ఇంటర్నల్ స్టోరేజ్ కోటా” సమస్య కారణంగా అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు.
[…] […]
[…] ఇంకా చదవండి: గూగుల్ సేవల్లో అంతరాయానికి కారణం ఇదే… […]
[…] ఇంకా చదవండి: గూగుల్ సేవల్లో అంతరాయానికి కారణం ఇదే… […]