మద్య శ్రేణి మొబైల్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుంటూ రెడ్ మీ సంస్థ కొత్త సిరీస్ ఫోన్లను తీసుకరాబోతుంది. రెడ్ మీ 10 పేరుతో కొత్త సిరీస్ లో ఫోన్లను తీసుకొస్తునట్లు సమాచారం. గౌగ్విన్, గౌగ్విన్ ప్రొ పేరుతో వీటిని షోవోమీ వీటిని రిజిస్టర్ చేసిందట. తాజాగా ఈ మొబైల్ లను షావోమీ ఎంఐ 10టీ సిరీస్ పేరుతో చైనాతో పాటు ఇతర మార్కెట్(భారత్ లో కాకుండా) లలో సెప్టెంబర్ 30 తేదీన విడుదల చేయనుంది. భారత్ ఇప్పటికే రెడ్ మీకి మద్య శ్రేణి విభాగంలో మంచి పేరు ఉంది, అందుకే వీటిని రెడ్ మీ బ్రాండ్ కింద నోట్ 10, నోట్ 10 ప్రొ పేరుతో వీటిని తీసుకొస్తునారట. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వీటిలో ఆక్టాకోర్ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. వీటిలో 5జీ కనెక్టివిటీ ఫీచర్ తో పాటు 64, 108 ఎంపీ కెమెరాలు ఉంటాయట. వీటిని అక్టోబర్ లో భారత్ మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు సమాచారం.(చదవండి: మీ ఫోన్ లో డీలిట్ చేసిన డేటాని తిరిగి పొందడం ఎలా?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.