ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అనే మూడు ఫోన్లు తీసుకొని వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే దీనిలో 120 హెర్జ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను తీసుకొనిరావడం విశేషం. ఈ ఫోన్లలో రెడ్ మీ నోట్ 10 చవకైనది కాగా, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ హై ఎండ్ మోడల్. వీటిలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతోపాటు ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంకు కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ మార్చి 18 నాడు అమేజాన్ లో ఫస్ట్ సేల్ కి రానుంది.(చదవండి: ఓలా సంచలనం: సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణం)

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సెట్టింగ్స్ కి వెళ్లి 120 హెర్ట్జ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఎంచుకోవచ్చు. దీనిలో నోటిఫికేషన్ ఎల్ఈడి లైట్ తీసేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొనిరాకుండా సైడ్ మౌంటెడ్ లాక్ ఆప్షన్ తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ రెడ్ మీ నోట్ 10 స్పెషల్ ఆప్షన్ లు ఇవ్వలేదు.

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ డిస్ ప్లే రివ్యూ:

ఇందులో 6.67 అంగుళాల హెచ్ డి సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇందులో అందించారు. హెచ్ డి ఆర్ 10 ప్లస్ సపోర్ట్ వస్తుంది. సన్ లైట్ లో కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి వీడియొలను మంచి క్వాలిటిలో చూడవచ్చు. స్టీరియో స్పీకర్ లు తీసుకొచ్చారు. డిజైన్ విషయంలో ఎంఐ 11 మాదిరిగా ఉంటుంది. చూడటానికి బాగానే ఉన్న బ్యాక్ కెమెరా బంప్ పైకి వచ్చింది.
డిస్ ప్లే రేటింగ్: 3.5/5

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కెమెరా రివ్యూ:


దీని మెయిన్ కెమెరా 108 మెగా పిక్సల్ అపర్చర్ ఎఫ్/1.9, 8 మెగా పిక్సల్ 120డిగ్రీ అల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా అపర్చర్ ఎఫ్/2.2, 5 మెగా పిక్సల్ టెలీ మాక్రో కెమెరా అపర్చర్ ఎఫ్/2.2, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా అపర్చర్ ఎఫ్/2.2 తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా విత్ అపర్చర్ ఎఫ్/2.2 తో వస్తుంది. స్లో మోషన్ వీడియొలను రెండు కెమెరాలతో రికార్డు చేయవచ్చు. 108 మెగా పిక్సల్ ప్రతి చిన్న దానిని కూడా బాగానే కాప్చర్ చేస్తుంది. లో లైట్ లో నార్మల్ మోడ్ లోనే భాగా వస్తున్నాయి. 108 ఎంపీతో భాగా లేదు.(చదవండి: పది నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్‌ చార్జ్!)

నైట్ మోడ్ లో భాగానే పనిచేస్తున్న తక్కువ కాంతిలో అంత మంచిగా పని చేయడం లేదు అని చెప్పుకోవాలి. ఫ్లాష్ తో తీస్తే ఓవర్ బ్రైట్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా డే లైట్ లో భాగానే పనిచేస్తుంది. పోర్ట్రైట్ ఫోటోలు కూడా భాగానే వస్తున్నాయి. లో లైట్ బ్యాక్ కెమెరాతో పోలిస్తే ఫ్రంట్ కెమెరాతో మంచిగా వస్తున్నాయి. మాక్రో కెమెరా మాత్రం భాగా పనిచేస్తుంది అని చెప్పుకోవాలి. 1080పీలో మాక్రో వీడియొ కూడా రికార్డు చేయవచ్చు.

బ్యాక్ కెమెరాతో 4కే వీడియొను 30ఎఫ్ పీ ఎస్ తో రికార్డు చేయవచ్చు. ఫ్రంట్ కెమెరాతో 1080పీ వీడియొ రికార్డు చేయవచ్చు. 1080లో 120ఎఫ్ పీ ఎస్ లో స్లో మోషన్ వీడియొలను రికార్డు చేయవచ్చు. దీనిలో తీసుకొచ్చిన కొన్ని ప్రత్యేక ఫీచర్స్ భాగానే ఉన్నాయి. డ్యుయల్ వీడియొ, వ్లాగ్ వీడియొ, క్లోన్ వీడియొ, ఫ్రిజ్ వీడియొ భాగా ఉంది. మొత్తం చెప్పాలంటే కెమెరా మాత్రం హైలేట్ అని చెప్పుకోవాలి.
కెమెరా రేటింగ్: 4/5

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బ్యాటరీ రివ్యూ:

ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చేసి 6 గంటలకు వస్తుంది. నార్మల్ గా అయితే, ఒక ఫుల్ డే వస్తుంది. 5 నుంచి 50 శాతం చార్జ్ కావడానికి 35 నిమిషాల సమయం పడుతుంది. ఫుల్ చార్జ్ కావడానికి ఒక గంటన్నర పడుతుంది.
బ్యాటరీ రేటింగ్: 3/5

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ గేమింగ్ రివ్యూ:

ఇందులో 732జీ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్ ఉంది. కాల్ ఆఫ్ డ్యూటి హై మోడ్ వరకు సపోర్ట్ చేస్తే, పబ్జీ స్మూత్, అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది. అన్నీ గేమ్స్ కూడా భాగానే పనిచేస్తున్నప్పటికి కొంచెం హీట్ సమస్య అనేది ఉంది. 47 డిగ్రీల వరకు చేరుకుంటుంది. వేసివి కాలం వస్తుంది కాబట్టి గది ఉష్ణోగ్రత 33 డిగ్రీల ఉంటుంది. కాబట్టి అంత పెద్దగా కంగారూ పడాల్సిన అవసరం లేదు.
గేమింగ్ రేటింగ్: 3.5/5

ఇక కాల్ క్వాలిటి, సిగ్నల్ రిసెప్షన్ కూడా భాగా ఉంది. ఇది 4జీ సపోర్ట్ తో వస్తుంది. 5జీ సపోర్ట్ మాత్రం లేదు. ఎంఐయూఐ మీద ఇది పనిచేస్తుంది కాబట్టి యాడ్స్ వస్తాయి. కొన్ని బ్లోట్ వేర్ యాప్స్ తో ప్రత్యేక యాప్స్ కూడా వస్తాయి. అన్నీ సెన్సార్ లు కూడా ఉన్నాయి. 4జీ volte, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. దీని బరువు 192 గ్రాములుగా ఉంది.

కెమెరా యూఐలో కొంచెం లాగింగ్ సమస్య ఉంది. కెమెరా ఆప్షన్ మద్య స్విచ్ అవుతున్న సమయంలో యూఐలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దీనిలో 750జీ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, 5జీ సపోర్ట్ తీసుకొస్తే ఇంకా బాగుండేది. ప్రొ, ప్రో మ్యాక్స్ లో పెద్దగా తేడా ఏమి లేదు. దీనిలో కనీసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తే బాగుండేది. రూ.20 వేలలో మంచి మొబైల్స్ లో ఇది ఒకటి అని చెప్పుకోవాలి.

మొత్తం రేటింగ్: 8/10

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర:

6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,999గా నిర్ణయించారు. డార్క్ నైట్, గ్లేసియర్ బ్లూ, వింటేజ్ బ్రాంజ్ రంగుల్లోనే ఈ ఫోన్ కూడా అందుబాటులో ఉండనుంది. దీని సేల్ మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లు, ఆఫ్ లైన్ రిటైల్ పార్ట్‌నర్ల వద్ద ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు జియో వినియోగదారులకు రూ.10 వేల విలువైన అదనపు లాభాలు కూడా దీని ద్వారా లభించనున్నాయి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here