Friday, April 19, 2024
HomeTechnologyPC/Laptopఅసలు టీఆర్‌పీ రేటింగ్ అంటే ఏమిటి.. టీఆర్పీ రేటింగ్ ని ఎలా తెలుసుకుంటారు?

అసలు టీఆర్‌పీ రేటింగ్ అంటే ఏమిటి.. టీఆర్పీ రేటింగ్ ని ఎలా తెలుసుకుంటారు?

టి ఆర్ పీ రేటింగ్ అనే పదాన్ని మనం చాలా సార్లు వినే ఉంటాం. బిగ్ బాస్ సీజన్ 4 మొదలు అయినప్పటి నుండి ఈ పదాన్ని ఎక్కువ సార్లు వింటుంటాం. ఇప్పుడు ఐపిఎల్ కూడా మొదలైంది అన్నీ చాన్నేళ్ళు, అభిమానులు ఈ టీఆర్పీ రేటింగ్ గురుంచి ఆలోచిస్తుంటారు… దేనికి ఎక్కువగా టీఆర్పీ వచ్చిందని. తాజాగా తెలిసిన వార్తా ప్రకారం బిగ బాస్ యొక్క తొలి వారంలో షోను 4.5 కోట్ల మంది వీక్షించార‌ని, 18.5 టీఆర్పీ న‌మోదు చేసింద‌ని తెలిపింది. అయితే రెండవ వారానికి వచ్చేసరికి  బిగ్‌బాస్ షోకు రెండో వారాంతం రేటింగ్ 10.7గా ఉంది. వారం మొత్తానికి కేవ‌లం 8.05 రేటింగ్ వ‌చ్చింది. దీనికి కారణం ఐపిఎల్ కూడా మొదలు అవ్వాడమే అని తెలుస్తుంది. అసలు ఈ టీఆర్పీ అంటే ఏమిటి అనే దాని గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

బార్క్  రేటింగ్స్‌ అనే విషయాన్ని మరో మాటలో చెప్పాలంటే టీఆర్‌పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) రేటింగ్‌ అని అంటారు. ఈ‌ బార్క్‌ అంటే Broadcast Audience Research Council India అని అర్థం. ఈ బార్క్ సంస్థ మనదేశంలో ఉన్న అన్ని టీవీ చానళ్ళు, వాటిల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. వాటిల్లో ఆయా భాషలను బట్టి, జనర్‌లను బట్టి వచ్చే ప్రోగ్రామ్‌లను ఎంత మంది చూస్తున్నారు, అవి ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ప్రసారమవుతున్నాయి, ప్రసారమైన సమయాన్ని బట్టి ఎంత మంది చూస్తున్నారు. తదితర వివరాలను సేకరించి టీఆర్‌పీ రేటింగ్‌ ను ఇస్తుంది.(చదవండి: భారత్ లో ప్రారంభమైన యాపిల్ ఆన్లైన్ స్టోర్ సేవలు)

అసలు టీఆర్‌పీ రేటింగ్ ఉపయోగం ఏమిటి?

పైన తెలిపిన విదంగా టీఆర్‌పీ రేటింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే టీవీ చానల్స్‌కు ఆయా ప్రోగ్రామ్‌లకు వచ్చే యాడ్స్‌ అన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో చానల్స్‌కు కూడా ఆదాయం వస్తుంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి వాళ్లు యాడ్‌ రేట్లను ఫిక్స్‌ చేస్తారు. నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌కు టీఆర్‌పీ రేటింగ్‌ ఎక్కువ వస్తుంది అనుకోండి. దానికి ఆ చానల్‌ వారు యాడ్స్‌ను ప్రదర్శించినందుకు ఎక్కువ మొత్తం డబ్బు వసూలు చేస్తారన్నమాట. అందుకు అనుగుణంగానే ప్రోగ్రామ్‌లకు వచ్చే టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి యాడ్‌ రేట్లను నిర్ణయిస్తారు. దాంతో టీవీ చానల్స్‌ వారికి ఆ యాడ్స్‌ ద్వారా ఆదాయం వస్తుంది.

టీఆర్‌పీ రేటింగ్ డేటాని బార్క్ ఎలా సేకరిస్తుంది?

- Advertisement -

అయితే ఈ డేటాను సేకరించడం కోసం కొన్ని నిర్దిష్టమైన టీవీలను ఎంచుకుని వాటిల్లో ప్రత్యేకమైన పరికరాలను అమర్చుతారు. ఈ పరికరాలు టీవీల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లలో వచ్చే ఆడియోలో ఉండే ఎంబెడ్డెడ్‌ వాటర్‌ మార్క్‌ సౌండ్లను గుర్తిస్తాయి. ఈ వాటర్‌ మార్క్‌ సౌండ్లు మన చెవులకు వినిపించవు.కానీ ఆ పరికరాలు మాత్రం గుర్తిస్తాయి. దీంతో ఆ పరికరాలు ఆ సౌండ్లను గుర్తించి అందుకు తగిన విధంగా ప్రోగ్రామ్‌ డేటాను జనరేట్‌ చేసి పైన చెప్పిన బార్క్‌ సంస్థకు ఇస్తాయి.వారు ఆ డేటాను విశ్లేషించి ఏ టీవీ చానల్‌ను జనాలు ఎక్కువగా చూస్తున్నారు, ఏ ప్రోగ్రామ్‌ను వారు ఎక్కువగా చూస్తున్నారు అనే డేటాను టేబుల్‌ రూపంలో ఇస్తారు.

అయితే ఈ టీఆర్‌పీ రేటింగ్స్ అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవు… ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం రేటింగ్ అనేది బాగుంది. రెండవ వారానికి వచ్చేసరికి తగ్గిపోయింది. దీనికి కారణం ఐపిఎల్ యొక్క ప్రభావం అనేది బిగ్ బాస్ రేటింగ్ మీద పడింది. ఇలా టీఆర్‌పీ రేటింగ్స్‌ మారుతూ ఉంటాయి. అయితే ఈ రేటింగ్స్‌ను మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకోవచ్చు. అందుకు కోసం మనం బార్క్‌ సైట్‌ https://www.barcindia.co.in/ ను సందర్శించాలి. దీంతో మీకు కూడా మన దేశంలో ఉన్న టీవీ చానల్స్‌, వాటి ప్రోగ్రామ్‌లకు చెందిన టీఆర్‌పీ రేటింగ్స్‌ తెలుసుకోవచ్చు.(చదవండి: భారత్ లో ప్రారంభమైన యాపిల్ ఆన్లైన్ స్టోర్ సేవలు)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles