పేద విద్యార్థులకు సీఎం జగన్ తీపికబురు అందించారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదివించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపకల్పన చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020-21 ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం నేడు అందించనుంది. వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ జగనన్న విద్యాదీవెన కింద ప్రతి ఏడాదిలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.671.45 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.