దేశ సమగ్రతకు భద్రతకు ముప్పు అంటూ ఇప్పటికే భారీగా చైనా యాప్‌లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 43 చైనా మొబైల్ యాప్‌లను తాజాగా నిషేధించింది. “ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ , హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా అలీబాబా వర్క్‌బెంచ్, అలీఎక్స్‌ప్రెస్, అలిపే క్యాషియర్, కామ్‌కార్డ్, వెడేట్ సహా 43 మొబైల్ యాప్‌లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద చర్య తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ” తన ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఐఐటి గువహతి పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ)

అంతకుముందు జూన్ 29న, 59 చైనా యాప్ లకు భారత్ లో నిషేదించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్ మరియు యుసి బ్రౌసర్ ఉన్నాయి. మళ్ళీ సెప్టెంబర్ 2న మరో 118 యాప్ లపై నిషేదం విధించింది. ఈ జాబితాలో పబ్ జీ వంటి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన పబ్ జీ గేమ్ కూడా ఉంది. వీటి అన్నింటినీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. (చదవండి: చైనాకు మరో షాక్.. పబ్జీతో పాటు 118 యాప్ లపై నిషేదం)

ప్రభుత్వం నిషేధించిన 43 యాప్‌ల జాబితా:

1) AliSuppliers Mobile App16) TrulyChinese – Chinese Dating App31) WeTV – Cdrama, Kdrama&More
2) Alibaba Workbench17) TrulyAsian – Asian Dating App32) WeTV Lite
3) AliExpress – Smarter Shopping, Better Living18) ChinaLove: dating app for Chinese singles33) Lucky Live-Live Video Streaming App
4) Alipay Cashier19) DateMyAge: Chat, Meet, Date Mature Singles Online34) Taobao Live
5) Lalamove India – Delivery App20) AsianDate: find Asian singles35) DingTalk
6) Drive with Lalamove India21) FlirtWish: chat with singles36) Identity V
7) Snack Video22) Guys Only Dating: Gay Chat37) Isoland 2: Ashes of Time
8) CamCard – Business Card Reader23) Tubit: Live Streams38) BoxStar (Early Access)
9) CamCard – BCR (Western)24) WeWorkChina39) Heroes Evolved
10) Soul- Follow the soul to find you25) First Love Live- super hot live beauties live online40) Happy Fish
11) Chinese Social – Free Online Dating Video App & Chat26) Rela – Lesbian Social Network41) Jellipop Match-Decorate your dream island!
12) Date in Asia – Dating & Chat For Asian Singles27) Cashier Wallet42) Munchkin Match: magic home building
13) WeDate-Dating App28) MangoTV43) Conquista Online II
14) Free dating app – Singol, start your date!29) MGTV-HunanTV official TV APP
15) Adore App30) WeTV – TV version
Banned China Apps in India