ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందడి మొదలైంది. ఈ సారి కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చేందుకు flipkart స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదర్చకుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు అని తెలిపింది. క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 21 రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని పేర్కొంది. ఇక ప్లస్ మెంబర్‌షిప్ లేని కస్టమర్లకు ఈ ఆఫర్ అక్టోబర్ 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 21 రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది అని తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే ఆఫర్ వర్తించదు.

డిస్కౌంట్స్ అనేవి ఎంతవరకు లభిస్తాయో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. గ్రాసరీ కాకుండా ఇతర ఏ ప్రొడక్ట్స్ కొన్నా కనీసం రూ.5,000 బిల్లింగ్ చేస్తే మీకు 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఒక వేల గ్రాసరీ అయితే కనీసం రూ.1,500 బిల్ చేయాలి. ప్లస్ మెంబర్స్ అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో ఇతర కస్టమర్లు 16, 17 తేదీల్లో ఒక క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,750 వరకు, ఒక డెబిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు అని తెలిపింది. ఇక 18 నుంచి 21 వరకు ఒక క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,500 వరకు, ఒక డెబిట్ కార్డుపై గరిష్టంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు అని తెలిపింది. మిగతా వివరాలను https://www.flipkart.com/pages/sbi-bbd-tnc వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here