petrol-price-cut

Petrol, Diesel Price: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించడంతో సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఇంధనం మరియు ఆహార ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ ప్రకటనలు వెలువడ్డాయి.

నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చేసిన 5 కీలక ప్రకటనలు:

  • పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు వెల్లడించారు. దీని వల్ల లీటర్ పెట్రోల్ ధర 9.5 రూపాయల మేర, డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు లక్ష కోట్ల ఆదాయం కోల్పోతున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరిగిపోవడంతో చమురు ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ తగ్గింపు తర్వాత హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉంటే, డీజిల్ ధర రూ.97గా ఉంది.
  • అంతేకాకుండా డొమెస్టిక్‌ గ్యాస్‌(LPG Subsidy) బండపై కూడా సబ్సిడీని పెంచింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై రూ.200 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా సుమారు
  • రూ.6100 కోట్ల రెవెన్యూ నష్టం కలగనున్నట్లు తెలిపారు. ఇక నుంచి రూ.200 సబ్సిడీని కేంద్రం లబ్దిదారుల ఖాతాలో జమ చేయనుంది.
  • ఎరువుల సబ్సిడీని ₹1.10 లక్షల కోట్లు అదనంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఈ ఏడాది బడ్జెట్‌లో ₹ 1.05 లక్షల కోట్లకు అదనం.
  • దిగుమతులపై అధికంగా ఆధారపడే ప్లాస్టిక్​ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్​ డ్యూటీని తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీని ద్వారా తయారీ ఖర్చు తగ్గుతుందన్నారు.
  • ఇంకా ఇనుము, స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామగ్రిపై కస్టమ్స్​ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు.
  • సిమెంట్ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

(ఇది కూడా చదవండి: ప్రతి పర్యటనలో నరేంద్ర మోడీ పక్కన ఉన్న ఈ మహిళా ఎవరు?)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here