Saturday, April 27, 2024
HomeBusinessడిసెంబర్ 1(నేటి) నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!

డిసెంబర్ 1(నేటి) నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!

ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి చేతులు వణుకుతాయి. అలా ఖాతాలో పడ్డ జీతం ఇంటి అద్దె బిల్లులు, చిన్న చితకా బిల్లుల పేరుతో తన కళ్ల ఎదుటే మాయపోతుంది. దీంతో నెల 2వ తేదీ నుంచి మళ్లీ ఒకటో తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తాడు. కేవలం, ఇదే కాదు ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకోవడంతో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనల వల్ల చాలా సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. దేశవ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబందనల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుందా? లేదా? అనేది తెలుసుకుందాం.

డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్:

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించిన రూపాయలను ఈఎంఐ కిందకు మార్చుకుంటే డిసెంబర్ 1 నుంచి ప్రతి నెల ఈఎంఐ అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్‌బీఐ ప్రకటించింది. అంటే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి.

అగ్గిపెట్ట ధర: 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట ధర పెరగడం ఇదే మొదటిసారి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధరలను పెంచనున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి రూ.1 అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండనున్నాయి.

(చదవండి: పెట్రోల్, డీజిల్ మీద కేంద్రం విధిస్తున్న పన్ను తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!)

పంజాబ్ నేషనల్ బ్యాంక్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ పొదుపు ఖాతా వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఇస్తున్న 2.90 వార్షిక వడ్డీని 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతానికి తగ్గిస్తూన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభించనుంది.

- Advertisement -

ఆదాయపు పన్ను రిటర్స్: 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్స్ ఫైల్ చేయాల్సిన వారికి 2021 డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. ఒకవేళ అప్పట్లోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత జరిమానా ఫీజు చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయల్సి ఉంటుంది.

పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్: నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ 1 నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్​ పొందాలంటే ఏటా నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది.

ఈపీఎఫ్: ఈపీఎఫ్ ఖాతాదారులు నవంబర్ 30లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. నవంబర్ 30లోపు యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయకపోతే డిసెంబర్ నెల నుంచి మీ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే యజమాని వాటా ఈపీఎఫ్ ఖాతాలో జమ కాదు.

(చదవండి: అసైన్డ్ భూములు అంటే ఏమిటి? అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చా?)

ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, డిసెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.266 పెంచాయి. ఈ నెల కూడా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.103.50 పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

రిలయన్స్ జియో: జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్స్‌పై 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు జియో ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ 2021 డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles