Tuesday, April 23, 2024
HomeGovernmentఈపీఎస్ వల్ల కలిగే లాభాలు ఏమిటి, పెన్షన్'కి ఎవరు అర్హులు?

ఈపీఎస్ వల్ల కలిగే లాభాలు ఏమిటి, పెన్షన్’కి ఎవరు అర్హులు?

ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సహాయం చేసే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్)ను ప్రవేశ పెట్టింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) పథకానికి అర్హులైన ఉద్యోగులందరూ కూడా ఈపీఎస్ పథకానికి అర్హులు. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తుంది. ఉద్యోగులకు 58 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత పెన్షన్ అందేలా చూస్తుంది. ఇప్పటికే ఈపీఎఫ్ఓలో ఉన్న సభ్యులు, కొత్త సభ్యులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

ఉద్యోగి, యజమాని ప్రతి ఒక్కరూ ఉద్యోగి ప్రాథమిక వేతనం + కరువు భత్యం మొత్తంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఉద్యోగి మొత్తం వాటా ఈపీఎఫ్ ఖాతాలో జమ అయితే, యజమాని/సంస్థ జమ చేసే వాటాలో 8.33% ఈపీఎస్ ఖాతాలో, మిగతా 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఈ పథకం ఒక ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది.

ఈపీఎస్ ప్రయోజనాలను పొందడానికి అర్హతలు

  • మీరు ఈపీఎఫ్ఓలో సభ్యుడు అయి ఉండాలి.
  • మీరు 58 సంవత్సరాల వయస్సును నిండి ఉండాలి.
  • మీరు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

ఈపీఎస్ వల్ల లాభాలు

  • ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్)ను భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది కాబట్టి, రిటర్న్ లకు గ్యారెంటీ ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రతి ఏడాది వడ్డీ లభిస్తుంది.
  • ప్రాథమిక వేతనం, రూ.15,000 లేదా అంతకంటే తక్కువ డిఏ పొందే ఉద్యోగులు ఈ పథకంలో నమోదు కావడం తప్పనిసరి.
  • మీరు 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మీరు ఈపీఎస్ ని ఉపసంహరించుకోగలుగుతారు. అయితే, మీరు అందుకునే మొత్తం వడ్డీ రేటు తగ్గుతుంది.
  • ఒకవేళ వితంతువు తిరిగి వివాహం చేసుకున్నట్లయితే, పిల్లలు మెరుగైన పెన్షన్ మొత్తాన్ని అందుకుంటారు. వారు అనాథలుగా వర్గీకరించబడతారు.
  • ఈపీఎఫ్ పథకంలో చేరిన ఉద్యోగులు స్వయం చాలకంగా ఈపీఎస్ పథకంలో నమోదు చేయబడతారు.
  • వ్యక్తి అందుకునే కనీస నెలవారీ పెన్షన్ మొత్తం రూ.1,000.

ఈపీఎస్ సర్వీస్ కాలిక్యులేషన్

ఒకవేళ ఒక ఉద్యోగి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసినట్లయితే సర్వీస్ పీరియడ్ 1 సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే, సర్వీస్ పీరియడ్ 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఆ పని వ్యవధిని పరిగణనలోకి తీసుకోరు. అందువల్ల, ఒక ఉద్యోగి 10 సంవత్సరాల 7 నెలలు పనిచేసినట్లయితే సర్వీస్ పీరియడ్ వచ్చేసి 11 ఏళ్లుగా లెక్కిస్తారు. అయితే, ఒకవేళ ఉద్యోగి 10 సంవత్సరాల 5 నెలలు పనిచేసినట్లయితే సర్వీస్ పీరియడ్ 10 ఏళ్లుగా లెక్కిస్తారు.

ఈపిఎస్ బ్యాలెన్స్ చెక్ చేసే విధానం

యూనివర్సల్ అకౌంట్ నెంబరు(యుఏఎన్)సాయంతో ఈపీఎస్ లో ఉన్న మొత్తాన్ని ఈపిఎఫ్ఓ పోర్టల్ ద్వారా చెక్ చేయవచ్చు. అయితే, ఉద్యోగులు ముందుగా యుఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

- Advertisement -
  • మీరు ఈపిఎఫ్ఓ(https://www.epfindia.gov.in/site_en/index.php) అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.
  • ‘మా సేవల’ మెనూ కింద ‘ఉద్యోగుల కోసం’ మీద క్లిక్ చేయండి.
  • తర్వాతి పేజీలోని ‘మెంబర్ పాస్ బుక్’ మీద క్లిక్ చేయండి.
  • తర్వాత, యూజర్ నేమ్(యుఏఎన్), పాస్ వర్డ్, క్యాప్చా వివరాలను నమోదు చేసి ‘లాగిన్’ అవ్వాలి.
  • ఇప్పుడు వివిధ మెంబర్ ఐడీలు కనిపిస్తాయి. సంబంధిత మెంబర్ ఐడీ మీద క్లిక్ చేయండి.
  • మీ ఈపీఎస్ ఖాతాలో ఉన్న మొత్తం మీకు కనిపిస్తుంది.

వ్యక్తులు 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్ పొందడానికి అర్హులు. అయితే, పెన్షన్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి వ్యక్తులకు 50 సంవత్సరాలు లేదా 58 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఒకవేళ వ్యక్తులు 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు పెన్షన్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకున్నట్లయితే, వారు తక్కువ ఈపీఎస్ మొత్తాన్ని అందుకుంటారు. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయని వ్యక్తులు అయితే 2 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్న వ్యక్తులు ఈపీఎస్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles