Friday, April 26, 2024
HomeGovernmentఆన్‌లైన్‌ ద్వారా కలర్ ఓటరు ఐడి కార్డును పొందడం ఎలా?

ఆన్‌లైన్‌ ద్వారా కలర్ ఓటరు ఐడి కార్డును పొందడం ఎలా?

భారతదేశంలో నివసించే వారికి ప్రతి ఒక్కరికి తమ గుర్తింపును తెలిపే పత్రలలో ఓటరు ఐడి కార్డు అనేది ఒకటి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా ఓటర్లు తమ నియోజక వర్గంలో జరిగే ప్రతి ఎన్నికలలో తమకు నచ్చిన వారికి ఓటును వేసే హక్కును కలిపిస్తుంది. ఈ కార్డు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత జారీ చేయబడుతుంది. అలాగే దీనిని ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ అని కూడా పిలుస్తారు.(ఇది కూడా చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా!)

మీరు ఇప్పటికే ఓటరు ఐడి కార్డును పొంది ఉంటే కనుక మీ ఓటరు ఐడీ మీద ఫోటో, పేరు, చిరునామా, ఓటరు ఐడి నంబర్ ఇతర వివరాలు కనిపిస్తాయి. భారత ఓటరు కమిషన్ వారి ఓటరు ఐడి కార్డులో తమ వివరాలను సరిదిద్దాలని కోరుకుంటున్న వారికి, ప్రస్తుత కొత్త ఓటర్లకు కలర్ ఓటరు ఐడి కార్డును ఇవ్వడం ప్రారంభించింది. మీ ప్రస్తుత బ్లాక్ & వైట్ ఓటర్ ఐడీ గుర్తింపు కార్డు గల వారు కలర్ ఫోటో గుర్తింపు కార్డు కోసం ఈ క్రింద చెప్పిన విదంగా చేయండి.

ఆన్‌లైన్‌లో కలర్ ఓటరు ఐడి కార్డును పొందే విధానం

  1. జాతీయ ఓటరు సేవా పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  2. హోమ్‌పేజీలో ఉన్న ఓటరు పోర్టల్ బాక్స్‌పై క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీరు వేరే(https://voterportal.eci.gov.in) పోర్టల్‌కు మళ్ళిస్తుంది.
  3. కొత్త వెబ్ పేజీలో మీకు కనుక అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి, లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
  4. ఇప్పుడు వెబ్‌సైట్‌ ఓపెన్ అయ్యాక డౌన్లోడ్ సెక్షన్ లోకి వెళ్లి ఫారం 6ని నింపండి.
  5. ఇందులో మీ ఫోటో, మీ ఇతర పూర్తి వివరాలను నింపి అప్‌లోడ్ చేసి సమర్పించండి.
  6. ప్రత్యామ్నాయంగా, మీరు సమీప ఈ-సేవా కార్యాలయం లేదా ఎంఈఈ సేవా కార్యాలయాన్ని సందర్శించి కొత్త కలర్ ఓటర్ ఐడి కార్డు కోసం నింపిన దరఖాస్తును సమర్పించవచ్చు. డాక్యుమెంట్ లు ప్రాసెస్ చేసిన తర్వాత మీరు కొత్త కార్డును పొందుతారు.

మీరు అందించిన అన్ని వివరాలు, డాక్యుమెంట్ లను వెరిఫికేషన్ చేసిన తర్వాత కలర్ ఓటర్ ఐడి కార్డు జారీ చేస్తారు. మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ని www.nvsp.in పోర్టల్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles