ఈ నెల ఫిబ్రవరి 1 నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు. మళ్లీ గత మూడు రోజుల నుంచి పెరుగుతున్నాయి. బడ్జెట్‌లో కస్టమ్ సుంకం తగ్గించడం వల్ల బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేశారు. కానీ మూడు రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,060 తగ్గగా, ఫిబ్రవరి 6 నుంచి 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.320 పెరిగింది. భవిష్యత్ లో కూడా ఇకపైనా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.(ఇది చదవండి: పీఎం కిసాన్ రైతుల కోసం మరో పథకం.. ప్రతి నెల ఖాతాలోకి రూ.3వేలు?)
ప్రస్తుతం హైదరాబాద్ లో నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర ప్రస్తుతం 10 పెరిగి రూ.44,070 చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాములు మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర రూ.10 పెరిగి ప్రస్తుతం రూ.48,080 ఉంది. వెండి ధరలు విషయంలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,400 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పులేదు. బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారణాలచే ప్రభావితమవుతాయి.(ఇది చదవండి: మహిళని కిడ్నాప్ భారీ నుంచి కాపాడిన యాపిల్ స్మార్ట్‌వాచ్!)
Date | City | 22 Carat Gold Today | 22 Carat Gold Yesterday | Daily Price Change |
Feb 8,2021 | Delhi | ₹46,220 | ₹46,210 | ₹10 |
Feb 8,2021 | Hyderabad | ₹44,070 | ₹44,060 | ₹10 |
Feb 8,2021 | Vijayawada | ₹44,070 | ₹44,060 | ₹10 |
Feb 8,2021 | Visakhapatnam | ₹44,070 | ₹44,060 | ₹10 |
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.