తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు డిసెంబర్ 14 నుండి తిరిగి ప్రారంభమవుతుంది. ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం అధికారికంగా స్లాట్ బుకింగ్ ప్రారంభించారు. 100 శాతం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన ఒక రోజు తర్వాత స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ నిర్ణయించిన సమాచారం, ఫీజులు చెల్లించిన తర్వాత స్లాట్ బుకింగ్‌లను ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత తమకు కేటాయించిన తేదీన వారి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించాలి. ముందస్తు స్లాట్ బుకింగ్ లేకుండా లావాదేవీలు/రిజిస్ట్రేషన్లు సాధ్యం కాదని అధికారులు తెలిపారు.(చదవండి: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతున్న టిక్ టాక్)

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం మొత్తం దేశానికి ఒక నమూనాగా ఉంటుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. కొత్త వ్యవస్థలో పారదర్శకంగా ఉండటంతో పాటు అధికారులకు విచక్షణాధికారాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్తుల నమోదు తరువాత, మ్యుటేషన్ లేదా యాజమాన్యం యొక్క మార్పు వెంటనే ఆన్‌లైన్‌లో జరుగుతుంది. పౌరులు కార్యాలయాల చుట్టూ పరుగెత్తాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ తరువాత వారికి ఇ-పాస్ పుస్తకం లభిస్తుంది మరియు 7 నుండి 10 రోజులలో, ఆర్గనైజ్ కలర్‌లో రెగ్యులర్ పాస్ బుక్ ఇవ్వబడుతుంది అని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఆధార్ నంబర్లను లేని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 96 శాతం సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని, మిగిలిన సేవలు కూడా త్వరలో లభిస్తాయని చెప్పారు. డేటా రక్షణ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సోమేష్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఏవైనా సమస్యలకు హాజరయ్యేందుకు 100 మంది అధికారులు, నిపుణులతో కూడిన వార్ రూమ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తోందని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ల గురించి ప్రజల ప్రశ్నలకు స్పందించడానికి కాల్ సెంటర్ కూడా 24 గంటలు పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. ప్రజలు కాల్‌సెంటర్‌ను 1800-599-4788 నెంబర్‌లో సంప్రదించవచ్చు. స్లాట్ బుకింగ్ కోసం, దరఖాస్తులు వారి ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పిటిఎన్) ఇవ్వాలి. PTIN లేని వారు రెండు రోజుల్లో స్థానిక సంస్థల నుండి పొందవచ్చు.

గమనిక: నేడు(డిసెంబర్ 12) స్లాట్ బుకింగ్ లో సాంకేతిక సమస్యలు వస్తునట్లు సమాచారం.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here