Telangana Lockdown

తెలంగాణలో పది రోజుల పాటు(మే 21 వరకు) కఠిన లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి మాత్రం ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందజేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అందచేసే ఈ-పాస్ ల కోసం తెలంగాణ పోలీస్ తెలిపిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. లాక్‌డౌన్‌ సడలించిన సమయంలో కాకుండా ఇతర వేళలో ప్రయాణించే వారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని తెలిపారు. (ఇది కూడా చదవండి: ఎల్ఐసీ పాలసీదారులు కరోనాతో మరణిస్తే డెత్ క్లెయిమ్ చేసుకోవచ్చా?)

ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత మీరు వెళ్లే పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు మాత్రమే ధరఖాస్తులను పరిశీలించి పాస్‌లను జారీ చేయనున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం ఆ రాష్ట్రాల పోలీసులు పాస్‌లు జారీ చేస్తారు అని డీజీపీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఎటువంటి పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే మిగతా సమయంలో ప్రయాణించే వారు మాత్రం తప్పనిసరిగా ఈ-పాసుల కోసం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ-పాస్ కోసం ధరఖాస్తు విధానం:

మొదట ఈ-పాస్ వెబ్‌సైట్(https://policeportal.tspolice.gov.in/) ఓపెన్ చేసి ఈ-పాస్ ఎంచుకోండి.


మీరు ప్రస్తుతం నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి.


ఆ తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, దేని కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలతో పాటు.. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ఫాంలను అప్‌లోడ్ చేయాలి.


ఇప్పుడు, మరలా మీ వివరాలు చెక్ చేసుకొని సేవ్ చేస్తే మీకు ఒక acknowledgment number(రశీదు సంఖ్య) వస్తుంది.

  • మీరు వెనక్కి వెళ్లి సిటిజన్ ప్రింట్ పాస్ మీద క్లిక్ చేసి రశీదు సంఖ్య నమోదు చేయండి.
  • మీరు వెళ్లాలి అనుకున్న పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీలు మీ వివరాలు పరిశీలించి ఈ పాస్ మంజూరు చేస్తారు.
  • ఈ పాస్ చూపించి ఇతర రాష్ట్రాలు, రాష్ట్రం పరిధిలోని జిల్లాలకు ఆంక్షల సమయంలో ప్రయాణం చేయవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.