తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అనుమతి లేని మరియు చట్టవిరుద్ధమైన లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. కొత్త G.O Ms.No. 131 ప్రకారం “ఆమోదించబడని మరియు చట్టవిరుద్ధ లేఅవుట్ల క్రమబద్ధీకరణ” కోసం నిబంధనల వివరాలతో విడుదల చేయబడింది. ఈ G.O ప్రకారం, దరఖాస్తుదారుడు ఆన్‌లైన్ దరఖాస్తును లేదా మీ-సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ మొత్తాన్ని చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వ్యక్తిగత ప్లాట్ యజమానులు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుతో పాటు రూ. 1000 / – మరియు లేఅవుట్ డెవలపర్లు మొత్తం లేఅవుట్ కోసం రూ .10,000 / – చెల్లించాలి. ఇప్పుడు మనం ఏ విధంగా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురుంచి తెలుసుకుందాం.(చదవండి: గూగుల్ మీట్ యూజర్లకు శుభవార్త)

ధరఖాస్తు కోసం కావలసినవి:

1) మీ ప్లాట్ యొక్క సరైన నెంబర్ (Ex: 1-122)
2) మీ ప్లాట్ యొక్క సర్వే నెంబర్ (Ex: 1-99/A or 255 or 3-356)
3) మీ ప్లాట్ యొక్క విస్తీర్ణం గజలలో (Ex: 100 or 120 )
4) మీ ప్లాట్ యొక్క సేల్ డీడ్ నెంబర్ (Ex: 3121)
5) మీ ప్లాట్ యొక్క సేల్ డీడ్ ఇయర్ (From 1900 to 2020)
6) మీ సేల్ డీడ్ మొదటి పేజీ (pdf ఫార్మాట్ లో 1 mb లోపు)
7) మీ లే అవుట్ యొక్క కాపీ (pdf ఫార్మాట్ లో 1 mb లోపు)కనిపిస్తుంది
8) మీ ఓనర్ షిప్ పత్రాలు, ఇతర పత్రాలు ఉంటే ఇవ్వండి ((pdf ఫార్మాట్ లో 1 mb లోపు)

Applying Online:
మీరు మొదట అన్నీ పత్రాలు దగ్గర పెట్టుకున్నక https://lrs.telangana.gov.in/ సైటులో కి వెళ్ళండి అక్కడ మీకు కుడి పక్కన Apply For LRS 2020 అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే Generate OTP అనే ఆప్షన్ వస్తుంది.

పైన తెలిపిన విదంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.

మీకు ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ కు వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేసి validate otp ని క్లిక్ చేయండి.

మీరు పైన చూపించిన విదంగా రెండు Options వస్తాయి. అందులో మీ వ్యక్తిగత కోసం Individual Plot ని క్లిక్ చేయండి.

తర్వాత మీ ప్లాట్ దేనికిందకు వస్తుందో దానికి సంబందించిన ఏరియా, జోన్, కార్పొరేషన్, సర్కిల్, వార్డు తదితర వివరాలను అడుగుతుంది.

ఇప్పుడు దాని కింది కాలంలో మీ ప్లాట్ యొక్క వివరాలు అడుగుతుంది. మీ ప్లాట్ లోకలిటీ, ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్, ఊరు పేరు, ప్లాట్ యొక్క విస్తీర్ణం, సేల్ డీడ్ నెంబర్, సేల్ డీడ్ ఇయర్, రిజిస్ట్రేషన్ ఆఫీసు వంటి వివరాలను ఇవ్వండి. (చదవండి: గూగుల్ మీట్ యూజర్లకు శుభవార్త)

తర్వాత మనం ఇప్పుడు చెప్పుకోబెయే పత్రాలను స్కాన్ చేసి upload చేయాలి. సేల్ డీడ్ మొదటి పేజీ, లేఔట్ యొక్క కాపీ, ఇంకా ప్లాట్ కు సంబందించిన ఇతర పత్రాలు ఉంటే అప్లోడు చేయాలి.

పైన తెలిపిన విధంగా దరఖాస్తు దారుడి పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబర్, ఇంటి నెంబర్, మీ చిరునామా వివరాలు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఇవ్వండి. దాని తర్వాత పేమెంట్ గెట్ వే ని క్లిక్ చేయండి.

మీరు పేమెంట్ అనేది పూర్తి చేశాక మీకు వస్తుంది Acknowledgement ఈ క్రింద చూపిన విధంగా వస్తుంది. దీనిని భవిష్యత్ కోసం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.

ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ ను సంప్రదించండి

Email:
mailto:support-lrs@telangana.gov.in
Phone:
1800 4258838
Raise Support Ticket:
https://lrstelangana.freshdesk.com/support/tickets/new

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.