తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఏడాది కావస్తున్న ఇంకా ఊర్లల్లోని భూ సమస్యలపై ధరణి వెబ్‌సైట్‌కు విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. భూములకు సంబంధించిన రకరకాల సమస్యలపై ఇప్పటికే లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి.

ప్రధానంగా చాలా మంది పేర్లు ఇంకా ధరణి పోర్టల్ లో చూపించకపోవడం, అసైన్డ్ భూముల జాబితా చూపించకపోవడం, పట్టా భూములు నిషేదిత భూముల జాబితాలో ఉండటం వంటి రకరకాల సమస్యలపై ఎక్కువగా పిర్యాదులు వస్తున్నాయి.

పార్ట్ బీలో చేర్చడం వల్ల భూములకు సంబంధించి పాస్‌ బుక్స్ రానోళ్లు, పాస్ బుక్ వచ్చినా ధరణిలో డిజిటల్ సైన్ కానోళ్లు, కొత్త పాస్ బుక్ వచ్చినా ధరణి పోర్టల్‌లో తమ సర్వే నంబర్, భూమి వివరాలు కనిపించనోళ్లు, అకారణంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో భూమి చేరినోళ్లు, రిజిస్ట్రేషనైనా మ్యుటేషన్ కానోళ్లు ధరణితో పాటు ధరణి గ్రీవెన్స్‌ వాట్సాప్‌ నంబర్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో ఉన్న భూములను తొలగించుకోవడానికి ఒక సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ధరణి నిషేదిత భూముల జాబితాలో ఉన్న రైతులు జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకోవడం ద్వారా మీ భూమిని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితా నుంచి తొలగించుకునే అవకాశం ఉంది. అయితే, ఏ విధంగా జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మొదటగా ధరణి పోర్టల్ లో మీ మొబైల్ నెంబర్ సహాయంతో లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయ్యాక సిటిజెన్ డాష్ బోర్డులో కనిపిస్తున్న “Grievance Relating To Inclusion in Prohibited Properties List” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఒక పాప్ అప్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి, మీ దగ్గర పాస్ బుక్ నెంబర్ ఉంటే “Yes” మీద, లేకపోతే “NO” మీద క్లిక్ చేయండి.
  • పట్టా పాస్ బుక్ నెంబర్ ఉంటే నెంబర్ ఎంటర్ చేయండి లేకపోతే మీ జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్, ఖాతా నెంబర్ నమోదు చేయండి.
  • ఆ తర్వాత ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో సర్వే నెంబర్ ఎంచుకొని ఎందుకు ఆ జాబితా నుంచి తొలగించాలో చివరలో ఇచ్చిన బాక్స్ లో రాయండి.
  • ఆ తర్వాత కచ్చితంగా మీ భూమిని ఈ జాబితా నుంచి తొలిగించాల అని అడుగుతుంది. yes అని క్లిక్ చేసి కారణం రాయాలి.
  • ఇప్పుడు మీ చిరునామాకి సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
  • చివరగా ఇప్పుడు దానికి సంబందించిన అధరాలు ఉంటే అప్లోడు చేయాలి.
  • ఇప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది దాన్ని సేవ్ చేసుకోవాలి.

Support Tech Patashala