tspsc-group-4-jobs
tspsc-group-4-jobs

TSPSC Group-4 Jobs: తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టుల భర్తీ చేసేందుకు అనుమతి లభించింది. 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ట్విటర్లో పేర్కొన్నారు. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ప్రధానంగా 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉన్నాయి.

వీటిలో 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నేడు అనుమతి ఇచ్చింది.