కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కొత్తగా కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఎటువంటి దరఖాస్తులను ఆహ్వానించట్లేదు అని తెలిపింది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వారి వివరాలను తనఖా చేసేందుకు రెవెన్యూ, విద్యా, కో-ఆపరేటివ్, సీవిల్‌ సప్లయ్‌ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పది రోజుల్లో విచారణ పక్రియను పూర్తి చేయడమేగాక దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దరఖాస్తుదారుల ఇళ్ల చిరునామాల ఆధారంగా నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆయా బృందాలు సమగ్ర విచారణ చేపట్టనున్నాయి. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు, కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి తదితర అంశాలను పరిశీలించనున్నారు. విచారణ అనంతరం ఆయా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం అర్హులందరికీ ప్రభుత్వం కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేయటంతో పాటు రేషన్‌ కోటా విడుదలకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకోనుంది. దారిద్రరేఖకు దిగువన (బీపీఎల్‌)ఉన్న వారికి మాత్రమే ఈ ఆహార భద్రతా/రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. పట్టణంలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఆహర భద్రతా కార్డులను జారీ చేయనున్నారు. కారు వంటి ఫోర్‌ వీలర్‌ ఉన్న వారిని అనర్హులుగా పరిగణిస్తారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here