encumbrance-certificate

వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు కొనుగోళ్లు & అమ్మకాలు జరిగేటప్పుడు ఎక్కువగా వాడే పదాల గురుంచి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మంచిది. వీటి గురుంచి తెలుసుకోవడం వల్ల వెంటనే మనకు మంచి జరగక పోయిన దీర్ఘకాలంలో ఎంతో మేలుని చేకూరుస్తాయి. అందుకే భూములకు సంబంధించిన ప్రతి పదాల గురుంచి తెలుసుకోవడం ఎంతో ఉత్తమం. మనం ఈ ఆర్టికల్‌లో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, సర్టిఫైడ్ కాపీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది భూ లావాదేవిలకు సమబంధించి ఆయా రాష్ట్రాలు జారీ చేసే ఒక ముఖ్యమైన పత్రం. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్’లో సదురు భూమికి సంబంధించిన పూర్తి చరిత్ర ఉంటుంది. ఈ భూమి మొదలు నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారిందో తెలియజేస్తుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే, మనం ప్రతి రోజు నిర్వహించే నగదు లావాదేవీల చరిత్ర కోసం బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగపడుతుందో. అలాగే, భూ లావాదేవీల చరిత్ర మొత్తం ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్’లో ఉంటుంది. ఇంకా, ఏదైనా భూమిని తనకా పెట్టి ఏదైనా డబ్బు తీసుకొచ్చిన అందుకు సంబంధించిన చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ భూమికి సంబంధించిన పూర్తి చరిత్ర ఇందులో ఉంటుంది.

ఎప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అవసరం?

  • ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు
  • ఆస్తి అమ్మినప్పుడు
  • గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు
  • ఆస్తి కొనడానికి పీఎఫ్ ఉపసంహరించుకునేటప్పుడు

ఎవరు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ జారీ చేస్తారు?

ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్’ని మీ దగ్గరలో గాల సబ్-రిజిస్టర్ కార్యాలయం వారు జారీ చేస్తారు. ఏదైనా ఆస్తి కొనుగోలు సమయంలో బ్యాంకులు, రుణ దాతలు ఎక్కువగా ఈ పత్రాన్ని కోరుతాయి.

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో ఏ వివరాలు ఉంటాయి?

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో ఆస్తి, దాని ప్రస్తుత యజమాని ఎవరు, ప్రస్తుత యజమాని ఎవరి నుంచి ఈ భూమి కొన్నారు, తనఖాలకు సంబంధించిన మొదలైన అన్ని వివరాలు ఉంటాయి.

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ పొందడానికి కావాల్సిన పత్రాలు ఏమిటి?

  • దరఖాస్తుదారుడు EC కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది పత్రాలు అవసరం.
  • చిరునామా రుజువు
  • సంతకం
  • EC కోరుతున్న ఆస్తి వివరాలు
  • ఆస్తి కోసం ఒక దస్తావేజు సృష్టించబడి ఉంటే దస్తావేజు యొక్క నకలు

ఆన్‌లైన్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చే రాష్ట్రాలు ఏవి?

రెండూ తెలుగు రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్’ని జారీ చేస్తున్నాయి. మీరు ఆ పోర్టల్’లో భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాది, సబ్ రిజిస్టర్ కార్యాలయం వంటి వివరాలు నమోదు చేస్తే కేవలం 2 నిమిషాల్లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ పొందవచ్చు.

ఆఫ్-లైన్‌లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ పొందడానికి ఎంత సమయం పడుతుంది?

ECని ఆఫ్-లైన్‌లో పొందడానికి కనీసం 15 నుంచి 30 రోజుల మధ్య సమయం పట్టవచ్చు.

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం?

ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆస్తికి సంబంధించిన నిజమైన భూ యజమాని వివరాలు తెలియజేస్తాయి. అలాగే, ఆ ఆస్తి ఎవరి నుంచి కొన్నారు, దాని మీద లోన్స్ వంటివి ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు తెలియజేస్తాయి. కొనుగోలుదారులు ఆస్తిని కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకునే ముందు విక్రేతలు ఈ పత్రాన్ని చూపించమని డిమాండ్ చేయాలి.