How To Download My Lost e-PAN Card

Download e-PAN Card: మన దేశంలో ఆధార కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పాన్‌ కార్డుకు ఉంది. అధిక మొత్తాల ఆర్థిక లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి అనే విషయం మన అందరికీ తెలుసు. ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) ఫైలింగ్ మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలైన వాటి కోసం పాన్ కార్డు అవ‌స‌రం. అయితే, ఇలాంటి పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే ఇక నుంచి భయడాల్సిన అవసరం లేదు. మీ పాన్‌ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని ఆదాయపు శాఖ విభాగం కల్పిస్తోంది.

పాన్ కార్డు పోతే కొత్త ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా?

  • మొదట https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html ఈ లింకు ఓపెన్ చేయండి.
  • అందులో మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పిన కోడ్ నమోదు చేయాలి.
  • మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది.
  • ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీరు ఇక్క‌డ‌ ఈ-పాన్ కార్డు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

(చదవండి: పెట్రోల్, డీజిల్ మీద కేంద్రం విధిస్తున్న పన్ను తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here