bhuvan-bam

ఒక్కప్పుడు డబ్బు సంపాదించాలంటే కొన్ని మార్గాలు మాత్రమే ఉండేవి కానీ. ఇప్పుడు అందిపుచ్చుకోవాలే గానే బోలెడన్ని అవకాశాలు మన ముందు ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వస్తుంది. యూట్యూబ్‌ ఒకప్పుడు ఇది ఎవరికి తెలియని పేరు కానీ, స్మార్ట్ ఫోన్ వచ్చాక దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే బంగారు గని.

అందరికంటే కొంచెం భిన్నంగా తెలివి, క్రియేటివిటీ, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం ఉండేలే గాని ఇందులో ఊహించని డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది వీటిని నిజం చేసి చూపిస్తున్నారు కూడా. ప్రస్తుతం యూట్యూబ్‌లో సొంతంగా చానెల్‌ కలిగి ఉండి.. దాని ద్వారా ఇంట్లో కూర్చునే చాలా మంది ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ కోవకు చెందిన యూట్యూబరే భువన్‌ బామ్‌. భువన్‌ బామ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా నెలకు ఏకంగా సుమారు 95 లక్షల రూపాయలు, ఏడాదికి రూ.22 కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఈ విషయాలను కానాలెడ్జ్‌.కామ్‌ అనే సైట్‌ వెల్లడించింది.

అంతేగాక భువన్‌ బామ్‌ పేరుమీద మరో రికార్డు కూడా ఉంది. భారతదేశంలో 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ సాధించిన తొలి యూట్యూబర్‌గా భువన్‌ రికార్డు సృష్టించాడు. న్యూఢిల్లీకి చెందని భువన్‌ బామ్‌ గ్రీన్‌ ఫీల్డ్స్‌ స్కూల్‌లో చదువు పూర్తి చేసుకున్నాడు. షాహీద్‌ బాగ్‌ సింగ్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం బీబీకి వైన్స్‌ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ స్టార్ట్‌ చేశాడు. చఖ్నా ఇష్యూ అనే వీడియో వైరల్‌ అవ్వడంతో భువన్‌ బామ్‌ చానెల్‌ సబ్‌స్క్రైబర్స్‌ పెరగడం ప్రారంభం అయ్యింది.(ఇది కూడా చదవండి: వృద్దులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!)

ప్రస్తుతం ఇతడి చానెల్‌కు ఏకంగా 22 మిలియన్ల మంది కన్న ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేశారు. అర్థవంతమైన కంటెంట్‌తో నెటిజనలును అలరిస్తుంటాడు భువన్‌ బామ్‌. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో కూడా నటించాడు భువన్‌ బామ్‌. ఇక యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా భువన్‌ బామ్‌ ఏడాది ఏకంగా 22 కోట్లు సంపాదిస్తున్నాడని.. నెలకు సుమారు 95 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడని.. కానాలెడ్జ్‌.కామ్‌ వెల్లడించింది.