వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 8టి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసి ఒక నెల కూడా కాలేదు అప్పుడే తదుపరి రాబోయే ఫోన్ వన్ ప్లస్ 9 మీద పుకార్ల మీద పుకార్లు వస్తున్నాయి. ఒక టిప్‌స్టర్ మాక్స్ జె గతంలో తను చెప్పిన వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్‌ల గురించి చెప్పిన విషయాలు చాలా వరకు నిజమయ్యాయి. ఇప్పుడు, తాజాగా వన్ ప్లస్ గురుంచి ఒక బ్లేజెల్ లెస్ లేకుండా ఉన్నా ‘Lemonade’ అనే కోడ్ పేరుతో వ్రాసిన ఒక చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కోడ్ అనేది తదుపరి రాబోయే వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ చెందినట్లు సమాచారం. ఇలా ‘Lemonade’ అనే కోడ్ పేరుతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ గురుంచి రాయడం ఇది మొదటిసారి కాదు.

ఇంతక ముందు చెప్పినట్లుగానే, వన్‌ప్లస్ 8టి స్మార్ట్ ఫోన్ ని ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో రూ .42,999 ప్రారంభ ధరతో విడుదల చేశారు. బేస్ వేరియంట్ వచ్చేసి 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. మరో వేరియంట్ 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర వచ్చేసి రూ. 45,999 రూపాయలు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.