గాల్వాన్ లోయ వద్ద భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తతల కారణంగా రెండు నెలల క్రితం ఇండియాలో పబ్‌జీ మొబైల్ తో సహా 116 యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పాపులర్ గేమింగ్ యాప్ పబ్‌జీ మొబైల్‌ను బ్యాన్ చేయడం యూత్‌లో కలవరం రేపింది. పబ్‌జీ నిషేదం తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఎప్పటిలాగే పబ్‌జీ మొబైల్ గేమ్ ఆడారు. పబ్ జి నిషేదం కన్నా ముందే యాప్ డౌన్ లోడ్ చేసుకున్నవారు గేమ్‌ను ఆడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, అక్టోబర్ 30న వారికి కూడా సేవలు ఆగిపోయాయి. అయితే వీరికి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రాబోతోంది.
భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు సౌత్ కొరియన్ గేమింగ్ కంపెనీ అయిన పబ్‌జీ ప్రయత్నాలు చేస్తోంది. పబ్‌జీ కార్పొరేషన్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. కానీ పబ్‌జీ మొబైల్ యాప్ నిర్వహించే బాధ్యతల్ని చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ కంపెనీకి అప్పగించింది. అందుకే పబ్‌జీ మొబైల్‌పై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. సౌత్ కొరియాకు చెందిన కంపెనీ క్రాఫ్టన్ చివరకు యూజర్ యొక్క డేటాను రక్షించడానికి స్థానిక సర్వర్లలోనే స్టోర్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. PUBG మొబైల్ సర్వర్లు ఇప్పుడు 2020 అక్టోబర్ 30న టెన్సెంట్ (చైనాకు చెందిన కంపెనీ) చేత సౌత్ కొరియాకు చెందిన కంపెనీకి అప్పగించబడ్డాయి. ఈ ఒప్పందం తరువాత, PUBG త్వరలో భారతదేశంలో ప్రారంభించటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో మళ్లీ సేవల్ని ప్రారంభించేందుకు పబ్‌జీ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే మళ్లీ పబ్‌జీ మొబైల్ గేమ్ ఇండియాలో అందుబాటులోకి వస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.