ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతా అతిపెద్ద పొదుపు వనరు. భవిష్యత్ అవసరాల కోసం ఈ ఖాతాలో ఉద్యోగుల నగదు జమ అవుతుంది. అయితే ఇలా జమ అయిన డబ్బులను తీసుకోవాలన్న, అలా జమ డబ్బులు నెల నెల పడుతున్నాయా లేదా అనే దానికి తెలుసుకోవడానికి గురుంచి మనకు తప్పని సరిగా యూనివర్సల్ అకౌంటు నెంబర్(UAN) ను ఆక్టివేట్ చేసుకుంటే చాలు. కానీ, కొంత మంది ఉద్యోగులు, కొత్త ఉద్యోగులకు ఈ విషయం తెలియక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కార్యాలయాల చుట్టూ తిరుగుతారు… లేదా మన ఆఫీసులో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అడగటం చేస్తూ ఉంటాం. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా ఉండటానికి మన చాలా సింపుల్ గా కూర్చున్న చోటు నుండే యూనివర్సల్ అకౌంటు నెంబర్(UAN)ను ఆక్టివేట్ చేసుకోవచ్చు.

మన ఈ వీడియోలో epfo అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో పూర్తిగా వివరించాను

యూనివర్సల్ అకౌంటు నెంబర్(UAN) ను తెలుసుకోవడం:

  • మనలో కొంత మందికి ఈ యూనివర్సల్ అకౌంటు నెంబర్(UAN) గురుంచి తెలియదు ఎక్కడ ఉంటుందో.
  • మన పేస్లీప్ ను గమనించినట్లయితే అందులో PF UAN అనే దాని పక్కన 12 నెంబర్ల(ఉదా:1234 1234 4325 2345) ఉంటుంది.
  • మనం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) వెబ్ సైట్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ Know Your UAN అనే సబ్ లింకు ఉంటుంది.
  • సైట్ లోకి వెళ్ళాక మీ మొబైల్ నెంబర్, ఆధార్ వివరాలు ఇచ్చినట్లయితే మనకు UAN నెంబర్ వస్తుంది.

యూనివర్సల్ అకౌంటు నెంబర్(UAN)ను ఆక్టివేట్ చేసుకోవడం:

  • మనం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) వెబ్ సైట్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ Activate UAN అనే సబ్ లింకు ఉంటుంది.
  • సైట్ లోకి వెళ్ళాక మీ UAN నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ వివరాలు ఇచ్చినట్లయితే మనకు ఒక ఓటీపీ వస్తుంది అది ఇచ్చినట్లయితే మనకు అకౌంటు ఆక్టివేట్ సక్సెస్ ఫుల్ అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మనం అదే సైట్ లో username దగ్గర మన uan నెంబర్ ఇవ్వండి. దాని క్రింద ఉన్నా forgot password ని క్లిక్ చేస్తే మళ్ళీ uan నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత మన మొబైలు నెంబర్ ఎంటర్ చేసాకు మీకు ఓటీపీ వస్తుంది.
  • ఇప్పుడు మనం ఓటీపీ ఇచ్చాక మీకు అక్కడ new password, confirm password చేశాక మీకు ఒక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అకౌంటు క్రియేట్ అవుతుంది.

ఇప్పుడు మనం దానిలో లాగిన్ అయ్యాక చాలా సేవలు పొందవచ్చు. డబ్బులు చెక్ చేసుకోవడం, విత్ డ్రా చేసుకోవడం, మన అకౌంటు కి బ్యాంక్ ని లింకు చేసుకోవడం ఇలా ఎన్నో సేవలు అందులో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here