రియల్ మీ తన కొత్త 55 అంగుళాల ఎస్ఎల్ఈడీ టీవీని భారత్ లో లాంచ్ చేసింది. కొత్త స్మార్ట్ టీవీ ప్రపంచంలోని మొట్టమొదటి SLED 4K TV అని పేర్కొంది. ఇందులో మంచి సినిమా స్థాయి అనుభూతిని ఈ టీవీల ద్వారా పొందవచ్చని తెలిపింది. చాలా సన్నని అంచులతో ఈ టీవీ లాంచ్ కావడం విశేషం. దీంతో పాటు రియల్ మీ మనదేశంలో 100W సౌండ్ బార్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో 60W ఫుల్ రేంజ్ స్పీకర్లు, 40W సబ్ ఊఫర్ ఉన్నాయి.(చదవండి: రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అమెజాన్)

రియల్ మీ స్మార్ట్ ఎస్‌ఎల్‌ఇడి టివి 55-అంగుళాల ఆండ్రాయిడ్ 9పై నడుస్తుంది. ఈ టీవీలో 1.7 బిలియన్ రంగులతో 4K అల్ట్రా హెచ్‌డి రిజల్యూషన్‌ను అందించే సినిమాటిక్ డిస్ప్లేను కలిగి ఉంది. దీని స్క్రీన్-టు-బాడీ రేషియో 94.6 శాతంగా ఉంది. సాధారణ క్యూఎల్ఈడీ ప్యానెల్ కంటే ఎక్కువ రంగులను ఇది చూపించగలదు. ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్-ఇన్ క్రోమా బూస్ట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది కలర్ ప్రొడక్షన్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. స్టాండర్డ్, స్పోర్ట్, గేమ్, వివిడ్, ఎనర్జీ సేవింగ్, యూజర్ మరియు మూవీ అనే ఏడు డిస్ప్లే మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రియల్ మీ క్వాడ్-కోర్ మీడియాటెక్ SoC తో వస్తుంది, ఇది 1.2GHz కార్టెక్స్- A55 CPUని కలిగి ఉంది, ఇది మాలి-470 MP3 GPU మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీలో డాల్బీ ఆడియో టెక్నాలజీతో పాటు 24W క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ కూడా ఉంది. (చదవండి: అక్టోబర్ 13న లాంచ్ కానున్న ఆపిల్ ఐఫోన్ 12)

రియల్ మీ స్మార్ట్ ఎస్‌ఎల్‌ఇడి టివి గూగుల్ అసిస్టెంట్ కి సపోర్ట్‌ చేస్తుంది. కనెక్టివిటీ కోసం మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఒక ఎవి అవుట్, ఒక ఈథర్నెట్ పోర్ట్ మరియు హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ టీవీలో బ్లూటూత్ వి 5.0 మరియు ఇన్‌ఫ్రారెడ్‌తో పాటు వైర్‌లెస్ కనెక్టివిటీలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై సపోర్ట్ కూడా ఉంది. ఇంకా, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్‌ను యాక్సెస్ చేయడానికి అంకితమైన హాట్‌కీలతో స్మార్ట్ రిమోట్ ఉంది.

రియల్ మీ టీవీ, సౌండ్ బార్ ధర

రియల్ మీ 55 అంగుళాల ఎస్ఎల్ఈడీ ధరను మనదేశంలో రూ.42,999గా నిర్ణయించారు. మొదటి సేల్‌లో మాత్రం దీన్ని రూ.39,999కే కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ అక్టోబర్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ప్రీబుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రియల్ మీ సౌండ్ బార్ విషయానికి వస్తే.. దీని ధరను రూ.6,999గా నిర్ణయించారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.