ఎలక్ట్రానిక్ లవర్స్ కి చేదు వార్త. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు (ఏసీ), మైక్రోవేవ్ ఓవెన్లు మరింత ప్రియం కానున్నాయి. ఇన్పుట్ ఖర్చులు 15-40 శాతం పెరగడం వల్ల టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు మరియు ఇతర గృహోపకరణాలు ఈ నెల చివరలో లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రియం కానున్నాయి. వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు (ఎసిలు) ధరలు 8-10 శాతం మరియు రిఫ్రిజిరేటర్ల రేట్లు 12- 15 శాతం పెరగవచ్చు. మరోవైపు, టెలివిజన్ల ధరలు 7-20 శాతం పెరగవచ్చు.(చదవండి: రైతులకు తీపి కబురు.. అప్పటి నుండే రైతుబంధు డబ్బుల పంపిణీ)
ఎలక్ట్రానిక్ తయారీలో ఉపయోగించే ముడి సరకులు రాగి, జింక్, అల్యూమినియం రేట్లు గత కొన్ని నెలలుగా పెరగడం వల్ల టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు (ఏసీ), మైక్రోవేవ్ ఓవెన్లు రేట్లు పెరగనున్నాయి. డిసెంబర్లో రాగి, జింక్, అల్యూమినియం రేట్లు 15-20 శాతం పెరగగా, సముద్ర సరుకు రవాణా అయ్యే ఖర్చు 40-50 శాతం పెరిగింది. గ్లోబల్ స్టోరేజ్ కారణంగా టెలివిజన్ ప్యానెళ్ల ధర 30-100 శాతం పెరిగింది మరియు ప్లాస్టిక్ ఖర్చు 30-40 శాతం పెరిగింది. ఫ్రిజ్‌లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం భాగా పెరిగింది.దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను ఒకేసారి అధిక మొత్తంలో పెంచక తప్పదని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. గతంలోనే వీటి ధరలను పెంచాల్సి ఉండగా పండుగ సీజన్ నేపథ్యంలో తయారీదారులు దైర్యం చేయాలకపోయారు. పండుగ సీజన్ ముగిసింది కావున కంపెనీలు ఈ నెల చివరి నుండి లేదా వచ్చే నెల ఆరంభం నుండి ధరలు పెంచనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఇంత మొత్తంలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని నిపుణులు తెలిపారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] […]