Saturday, April 20, 2024
HomeGovernmentEWS: ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ శుభవార్త..?

EWS: ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ శుభవార్త..?

Economically Weaker Section(EWS): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(EWS) అభ్యర్థులు ప్రస్తుతం ఓసీగానే పరిగణిస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(TSLPRB) ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రిలిమ్స్‌ రాతపరీక్ష తర్వాత ఎంపికైన అభ్యర్థుల నుంచి రెండో విడత సమగ్ర దరఖాస్తు తీసుకుంటామని, ఆ సమయంలో ఈడబ్ల్యూఎస్‌ వివరాలు, ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. తాజా పోలీస్‌ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉండటంతో ఈ ధ్రువీకరణ పత్రానికి ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకొంది.

(ఇది కూడా చదవండి: ఎస్ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను విడుదల చేసిన టీఎస్ఎల్‌పీఆర్‌బీ)

అయితే, తహశీల్దారు కార్యాలయాల నుంచి ఈ ధ్రువీకరణపత్రం పొందే క్రమంలో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజాగా ఈ సూచన చేస్తూ.. అభ్యర్థులు ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణపత్రాలకు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది. దీంతో, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు కాసింత ఉపశమనం లభించింది.

ఈడబ్ల్యూఎస్(EWS Certificate Eligibility) సర్టిఫికేట్ పొందడానికి కావాల్సిన అర్హతలు:

  • కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలలోపు ఉండాలి.
  • ఆ కుటుంబానికి భూమి 5 ఎకరాలకు మించి ఉండకూడదు
  • గృహ విస్తీర్ణం 1000 చదరపు అడుగులలోపు ఉండాలి
  • గ్రామీణ లేక నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఇంటి స్థలం(ప్లాట్‌) 200 గజాల విస్తీర్ణంలోపు ఉండాలి.
  • మున్సిపాలిటీ ఏరియాలో ఇంటి స్థలం(ప్లాట్‌) 100 గజాల విస్తీర్ణంలోపు ఉండాలి.

ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ జారీ విషయంలో కూడా తెలంగాణలో కొంత సందిగ్ధత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం 2021 మార్చి నెలలో జారీ చేసిన జీవో నెంబర్ 65లో పైన పేర్కొన్న అర్హతలు అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

- Advertisement -

అలాగే, 2021 ఆగస్టు నెలలో జారీ చేసిన 243, 244 జీవోలో కేవలం కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలలోపు అనే నిబంధన ఉంది. ఈ జీవోలో ఎక్కడ కూడా ఆస్తులు గురించి పేర్కొన పోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 244 జీవో క్రింది స్థాయిలో అమలు కావడం లేదు.

(ఇది కూడా చదవండి: ఈడబ్ల్యూఎస్(EWS) సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎవరు అర్హులు..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles