Saturday, April 27, 2024
HomeGovernmentకొత్త ఓటర్ కార్డు కోసం ఇంట్లో నుండే ధరఖాస్తు చేసుకోవడం ఎలా ..?

కొత్త ఓటర్ కార్డు కోసం ఇంట్లో నుండే ధరఖాస్తు చేసుకోవడం ఎలా ..?

ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి యొక్క నిజమైన ఆయుధం ఓటు హక్కు కలిగి ఉండటం. మనకు రేషన్ కార్డ్, ఆధార కార్డ్ ఎంత ముఖ్యమో ఆదేవిదంగా ఓటర్ కార్డును కలిగి ఉండటం కూడా ముఖ్యమే, ఎందుకంటే నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం వస్తుంది కాబట్టి. అయితే 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ ఓటర్ కార్డును పొందటానికి అర్హులు, మనం ఈ ఓటర్ కార్డు కోసం బయటికి ఎక్కడికో వెళ్ళకుండా ఇంట్లో నుండే ధరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మన దగ్గర ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ ప్రూఫ్/ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ రెండు మన దగ్గర ఉన్నట్లయితే ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.(చదవండి: “బిగ్ బిలియన్ డేస్” సేల్ తేదీలను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్)

దీని కోసం మీరు ముందుగా ఎన్నికల కమిషన్ కి సంబందించిన వెబ్ సైట్ https://eci.gov.in/ కి వెళ్ళాలి. అందులో మీకు REGISTER NOW TO VOTE అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే మీకు Create Account అనే పేజీ కనిపిస్తుంది. దాంట్లో మీ మెయిల్/ లేదా మొబైలు నెంబర్ లేదా ఫేస్ బుక్ అకౌంట్, ట్విటర్, లింక్డ్ఇన్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. దాని తర్వాత మీ పేరు, రాష్ట్రం పేరు నింపిన తర్వాత మీకు New Voter Registration అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ స్కాన్ కాపీ, రేషన్ కార్డ్/ అడ్రస్ ప్రూఫ్ స్కాన్ కాపీ, ఒక ఫోటో Upload చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఈమెయిల్‌కు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీని సాయంతో మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. కార్డు నెల రోజుల్లోగా మీ ఇంటికి పోస్ట్ లో వస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles