ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం తొమ్మిదో విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మోడీ రైతుల ఖాతాలో క్రెడిట్ చేయడం ప్రారంభించారు. 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాల ఖాతాలో రూ.19,500 కోట్లకు పైగా నగదు జమ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద దేశవ్యాప్తంగా 5 ఏకరాలలోపు ఉన్న రైతు కుటుంబాల ఆర్ధిక ప్రయోజనం మేరకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది.

ప్రతి ఏడాది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి 2 వేల రూపాయల చొప్పున రూ.6,000 అందజేస్తారు. ఆగస్టు 9న 2 వేల రూపాయలు వేయడం ప్రారంభించింది. అయితే, మీ ఖాతాలో పీఎం కిసాన్ నగదు డబ్బులు పడ్డాయో లేదో అని తెలుసుకోవచ్చు. మీరు ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా, మొబైల్ యాప్ ఉపయోగించి మీ పేరును చెక్ చేసుకోవచ్చు. డబ్బులు పడ్డాయో లేదో ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

  • మొదట మీరు ఈ లింకు https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx మీద క్లిక్ చేయండి.
  • మీకు మూడు ఆప్షన్ల(ఆధార్ నెంబరు, ఖాతా సంఖ్య, మొబైల్ నెంబరు) ద్వారా మీ క్రెడిట్ వివరాలను చెక్ చేయవచ్చు.
  • ఆధార్ నెంబర్/ఖాతా సంఖ్య/మొబైల్ నెంబరు నమోదు చేసి గెట్ డేటా మీద నొక్కండి.
  • ఇప్పుడు, మీరు మీ వివరాలను తనిఖీ చేయవచ్చు.

Support Tech Patashala