Friday, April 19, 2024
HomeGovernmentNew Options in Dharani Portal: ధరణి పోర్టల్‌లో మరో 3 కొత్త ఆప్షన్లను తీసుకొచ్చిన...

New Options in Dharani Portal: ధరణి పోర్టల్‌లో మరో 3 కొత్త ఆప్షన్లను తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Application For Passbook Data Correction – 3 New More Options in Dharani Portal: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్‌ కోసం రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో 3 కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. కొంత కాలంగా పరిష్కారం కానీ కొన్ని సమస్యలకు దారి చూపడానికి ఈ కొత్త ఆప్షన్ లతో వాటి పరిష్కారానికి అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ 3 కొత్త ఆప్షన్లు అనేవి టీఎమ్ 33 మాడ్యూల్ కింద అందుబాటులో ఉంటాయి.

ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చిన 3 కొత్త ఆప్షన్లు ఇవే:

  1. నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా బదిలీ చేయడం [Transfer of land From Notional Khata (all Type of) To Patta Land]
  2. భూమిని నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్చడం [Change Land Usage from NALA To Agriculture Land]
  3. ధరణి కంటే ముందు గజాలలో కొంత భూమి అమ్మబడింది [Part Land Sold Out in Square Yards Before Dharani]

నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా మార్చడం:

నోషనల్ ఖాతా అంటే ఈ ఖాతా నెంబర్లను రెవెన్యూ అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్‌ తరువాత కొందరు పట్టాదారు పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి సందర్భాల్లో అధికారులు తాత్కాలికంగా 100000, 100001 అంకెల్లో నోషనల్‌ నెంబర్లు ఇస్తారు.

భూముల వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నపుడు కూడాఇలా నెంబర్లు ఇస్తారు. అప్పటికప్పుడు పని జరగడానికి వీటికి ఆ నెంబర్ ఇస్తారు. శాశ్వత ఖాతా నెంబర్లు 1 నుంచి 4 అంకెల్లోపు మాత్రమే ఉంటాయి. నోషనల్‌ నెంబర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి లక్ష నుంచి మొదలవుతాయి. ఇప్పుడు పట్టా భూములు గనుక ధరణి పోర్టల్‌లో నోషనల్ ఖాతా పడితే ఆ భూములను తిరిగ పట్టా భూములుగా మార్చుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

మీ భూమిని వ్యవసాయేతర భూమి(NALA) నుంచి వ్యవసాయ భూమిగా మార్చడం:

మీ భూమి గనుక పొరపాటున లేదా సాంకేతిక, ఇతర కారణాల వల్ల ధరణిలో నాలా కింద గనుక చూపిస్తే, ఆ భూములను తిరిగి వ్యవసాయ భూమిగా మార్చుకోవడం కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

- Advertisement -

నాలా(NALA నాన్-అగ్రికల్చరల్ లాండ్ అసెస్మెంట్ యాక్ట్) అంటే ఏమిటి?

వ్యవసాయేతర భూముల అసెస్మెంట్ చట్టం 1963 లో ప్రవేశపెట్టబడింది. తెలంగాణలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియను నాలా అంటారు. వ్యవసాయేతర అవసరాల కోసం ఈ భూమిని వినియోగిస్తారు.

ధరణి కంటే ముందు గజాలలో కొంత భూమి అమ్మితే:

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొని రాకముందు తమ అవసరాల కోసం కొంత భూమిని నాలాగా మార్చకుండానే వ్యవసాయేతర అవసరాల కోసం గజాలలో విక్రయించారు. అలా విక్రయించడంతో ఇప్పుడు ఆ భూమిలో మిగతా కొంత భూమి కూడా ధరణిలో గజలలో చూపిస్తుంది. అయితే, అలాంటి వాటి పరిష్కారం కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

ధరణి పోర్టల్ వల్ల ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఈ నెంబర్’కు కాల్ చేయండి => 6302212352

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles