మనం అత్యవసరంగా బయటకు వెళ్లాలి, చేతిలోనేమో పవర్‌ బ్యాంక్‌ లేదు ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు తగిన సమయం లేదు. అటువంటి సమయంలో ఒక పది నిమిషాలు ఉండి ఎంతో కొంత ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తాం. కానీ, ఆ సమయంలో పది నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు మీ కోరికను తీర్చే టెక్నాలజీ రాబోతుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌తో ఒక గంట లోపులో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.(చదవండి: ఇండియాలో తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్‌ ఫోన్ విడుదల!)

కానీ, షియోమీ కంపెనీ త్వరలో తీసుకొనిరాబోయే టెక్నాలజీతో కేవలం పది నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనికోసం 200వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో గల మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని షియోమీ యోచిస్తుంది. 200వాట్ ఫాస్ట్‌ చార్జర్ తో కేవలం పది నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్ ఫుల్‌ ఛార్జింగ్‌ కానున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఇంకోవైపు రియల్‌మీ 125వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని వాణిజ్య పరంగా తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే vivo iQOO7లో తీసుకొచ్చిన 120వాట్ ఛార్జర్‌ సహాయంతో 4000ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు అని కంపెనీ పేర్కొంటుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.