RBI Repo Rate Hike

RBI Repo Rate Hike: ద్రవ్యోల్బణాన్ని రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 నుంచి 4.9 శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని ఆర్​బీఐ గవర్నర్ చెప్పారు.

రేపో రేటు అంటే ఏమిటి?

బ్యాంకులకు అప్పుగా ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే(రెపో రేటు) వడ్డీరేటును రేపో రేటును రేపో రేటు అంటారు. తాజాగా ఆర్‌బీఐ వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.9 శాతానికి చేర్చినట్లు ప్రకటించింది.

రెపోరేటును మరోసారి పెంచిన ఆర్​బీఐ

ఇప్పటికే మే 4న రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచిన 4.40 శాతం చేయగానే, బ్యాంకులు తమ వినియోగదారులకు ఆ భారాన్ని ఇప్పటికే బదలాయించాయి. తాజా మార్పునకు అనుగుణంగా బ్యాంకులు మళ్లీ వడ్డీ రేట్లు పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదా(ఈఎమ్‌ఐ)లు మరింత భారం కానున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు.. వృద్ధికి సహకారం అందించేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్‌బీఐ తెలిపింది. అంటే రెపోరేటు మరింత పెంచుతామనే సంకేతాలు ఇచ్చారు.

(ఇది కూడా చదవండి: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు తేదీని పొడగించిన కేంద్రం!)