వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకువస్తే, పెట్రోల్‌ లీటర ధర రూ.75కు దిగివస్తుందని బ్యాంకింగ్‌ దిగ్గజం-స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థికవేత్తలు గురువారం నాటి తమ తాజా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇందుకు రాజకీయ సంకల్పం కొరవడిందనీ నివేదిక విశ్లేషించింది. ఈ కారణంగానే పెట్రో ప్రొడక్ట్స్‌ అత్యధికంగా ఉన్న దేశాల సరసన భారత్‌ ఉండాల్సి వస్తోందని పేర్కొంది.

జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే, పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.75కు దిగివస్తే, డీజిల్‌ లీటర్‌ ధర రూ.68కి తగ్గుతుంది. దీనివల్ల కేంద్ర రాష్ట్రాలకు ఆదాయ నష్టం దాదాపు లక్ష కోట్లు ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 0.4 శాతం. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర బేరల్‌కు 60 డాలర్లు, డాలర్‌కు రూపాయి మారకం విలువ రూ.73 వద్ద స్థిరంగా చూసి వేసిన అంచనా ఇది. ప్రస్తుతం ప్రతి రాష్ట్రం దేనికి అదే ఇంధనంపై పన్నులు విధిస్తోంది. కేంద్రం తన సొంత సుంకాలు, సెస్‌లు వసూలు చేస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100కు తాకుతోంది. పెట్రో ఉత్పత్తులపై సుంకాల విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

నిజానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీలోకి తీసుకురావాల్సి ఉంది. జీఎస్‌టీ ఫ్రేమ్‌వర్క్‌ అజెండాలో ఈ అంశం ఉంది. అజెండాలో పూర్తికాని అంశంలో ఇది ఒకటి. దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం, సంకల్పం కొరవడింది. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చమురు ధర స్థిరీకరణ నిధి(ఓపీఎస్‌ఎఫ్‌) ఏర్పాటు అవసరం. చమురు ధరల ఒడిదుడుకుల సమస్య ప్రత్యక్షంగా వినియోగదారుడిపై పడకుండా చూసేలా ఈ నిధి విధి విధానాలను రూపొందించాలి. ఈ చర్య మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఎల్‌పీజీ సిలిండర్‌కు సంబంధించి సబ్సిడీలు కేవలం పేదలకు మాత్రమే అందే చర్యలను కేంద్రం తీసుకోవాలి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here